పాలలో ఔషధ ఉపయోగాలు చాలా ఉన్నాయి... అవి ఏమిటంటే...?

kalpana
 పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా ఆవు పాలు చాలా మంచివి. పాలను పలు రకాలుగా ఉపయోగించుకుంటున్నాం. పాలు తాగిన, పాలతో తయారుచేసిన ఆహార పదార్థాలను తిన్న ఆరోగ్యానికి చాలా మంచిది.పాలలో దాగి ఉన్నా ఔషధ ఉపయోగాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం...                           
 బలహీనంగా ఉన్న వాళ్ళు బరువు పెరగాలంటే ఈ రోజు పాలు తీసుకోవడం వల్ల వారానికి మూడు నుంచి ఐదు పౌండ్లు బరువు పెరుగుతారు. నిదానముగా శరీర బరువు ఉండాల్సిన స్థితికి చేరుకుంటుంది.
 రోజు పాలు తాగడం వల్ల కళ్ళు తేటగా ప్రకాశవంతంగా అవుతాయి. అంతేకాకుండా ఆరోగ్యం మెరుగుపడుతుంది.శరీరంలోని అన్ని అవయవాలకు శక్తి అందుతుంది.
పాలు రక్త ప్రసరణ సక్రమంగా జరగడానికి ఉపయోగపడతాయి.పాలు తాగటం వల్ల కడుపు, ప్రేవుల్లో ని ద్రవాంశం వృద్ధి చెందుతుంది.దీనివల్ల రక్త ప్రసరణ సహజంగా మెరుగుపడుతుంది.రక్త ప్రసరణ సక్రమంగా జరగడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది.
 కడుపులో యాసిడ్ తయారవుతూ హైపర్ ఎసిడిటీ తో బాధపడుతున్న వాళ్లకి పాలు మంచి ఆహారం. పాలు జీర్ణం కావడానికి యాసిడ్ అధికంగా కావాల్సి వస్తుంది.పాలలో ఉండే ఆల్కలైన్ ని తయారుచేసే పదార్థాల వల్ల శరీరంలోని యాసిడ్ స్థితిని ప్రేరేపించే పరిస్థితులు చాలా త్వరగా సాధారణ స్థితికి వస్తాయి.
 నిద్రలేమితో బాధపడుతున్న వాళ్లు రోజు పడుకోబోయేముందు ఒక గ్లాసు పాలలో తేనె కలుపుకొని తాగడం వల్ల సుఖ నిద్ర పడుతుంది.
 జలుబు, గొంతు బొంగురు పోవడం,  ఉబ్బసం,టాన్సిలైటిస్,బ్రాంకైటిస్ వ్యాధులు ఉన్న వాళ్ళు ఒక గ్లాసు వేడి పాలలో చిటికెడు పసుపు,కొద్దిగా మిరియాల పొడి కలుపుకొని రోజు రాత్రి సమయంలో తాగడం వల్ల ఈ సమస్యలన్నీ తగ్గడమే కాకుండా,శ్వాస సంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి.
 పాలమీద మీగడ లో కొద్దిగా వెనిగర్, చిటికెడు పసుపు కలిపి గాయాల పైన, పుండ్లు పైన, పూయడం వల్ల త్వరగా మానిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: