పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ .. భారీగా తగ్గిన ధరలు..

Satvika
వావ్.. ఇది విన్నారా.. ఈరోజు పసిడి ధరలు వింటే మతి పోవాల్సిందే.. మగువలకు కళ్ళు చెదిరె గుడ్ న్యూస్..గత నాలుగు రోజులుగా పెరుగుతూ వస్తున్న  గోల్డ్ ధరలు ఈరోజు మార్కెట్ లో భారీగా కిందకు దిగి వచ్చాయని తెలుస్తుంది. గురువారం మార్కెట్ లో పసిడి ధరలకు రెక్కలు వచ్చిన సంగతి తెలిసిందే.. ఈరోజు చూస్తే పసిడి ధరలు ఉపశమనం కలిగిస్తున్నాయి.. ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి.గత కొన్ని రోజులుగా ఎప్పుడూ బంగారం ధరలు తగ్గుతాయా అని ఎదురుచూస్తున్న మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్. బంగారం కొనుగోల్లు ఈరోజు మార్కెట్ లో పెరిగాయి.. బంగారం ధరల తగ్గితే వెండి ధరలు కూడా అదే దారిలో నడుస్తున్నాయి. నేడు మార్కెట్ లో ధరలు భారీగా కిందకు దిగి వస్తున్నాయి.  అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు పైకి కదిలాయి.

హైదరాబాద్ మార్కెట్ లో ఈరోజే ధరలను ఒకసారి చూద్దాం...10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1750 భారీగా తగ్గిపోయింది. కాగా, ఇప్పుడు బంగారం ధరలు రూ. 52,580కు పడిపోయింది.. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. పసిడి రేటు రూ.1600 తగ్గడంతో రూ. 48,200కు చేరింది. బంగారం ధరలు పడిపోతే.. వెండి రేటు కూడా భారీగా తగ్గింది. ఏకంగా రూ.2,600 పతనమైంది. ఈ మేరకు నేడు మార్కెట్ లో వెండి ధరలు రూ. 74,100కు దిగి వచ్చింది.

ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర భారీగా పెరిగింది. ఒకసారి ధరలను చూస్తె.. ఔన్స్‌కు 0.02 శాతం పైకి కదిలింది. కాగా, పసిడి ధర ఔన్స్‌కు 2001 డాలర్లకు ఎగసింది.. బంగారం పెరిగితే వెండి కూడా భారీగానే పెరుగుతూ వచ్చింది. వెండి ధర ఔన్స్‌కు 0.02 శాతం పెరుగుదలతో 26.26 డాలర్లకు పెరిగింది..అయితే, గోల్డ్ రేటుపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో వచ్చిన కీలక మార్పులు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, జువెలరీ మార్కెట్ మొదలగు అంశాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని గమనించాలి.నేడు మార్కెట్ లో భారీగా తగ్గిన బంగారం ధరలు రేపు మార్కెట్ లో ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: