గత సంవత్సరంతో పోలిస్తే బంగారం దిగుమతుల్లో రికార్డు...

VAMSI
ఈ ప్రపంచంలో ఉన్న వారు ఎవరికైనా బంగారం అంటే ఇష్టం లేకుండా ఉండదు అన్న విషయం తెలిసిందే. మనకు దొరికే కొన్ని విలువైన ఖనిజాలలో బంగారం కూడా ఒకటి. మహిళలకు బంగారం అంటే అత్యంత ప్రీతి. ఇక పండుగలు లేదా శుభకార్యాలు వచ్చాయంటే ఇక బంగారం కొనడం కోసం చాలా బిజీగా తిరుగుతూ ఉంటారు. అయితే కరోనా వైరస్ కారణంగా బంగారం ధరలలో హెచ్చు తగ్గులు వచ్చాయి. కొద్ది రోజులు భారీగా ధరలు పెరగడం మరి కొద్ది రోజులు అతి తక్కువ ధరలు తగ్గడం మనము చూశాము. ఇక గత నెల శ్రావణ మాసం ఉండడంతో శుభకార్యాలు భారీ ఎత్తున జరిగాయి. దీనితో బంగారం కొనుగోళ్లు మాములుగా జరగలేదు. అయితే బంగారు విక్రయాల గురించిన ఒక వార్త ఈ రోజు అంతా చక్కర్లు కొడుతోంది. మాములుగా కరోనా వచ్చినప్పటి నుండి ప్రజల దగ్గర డబ్బులు లేక బంగారం కొనడం చాలా తగ్గిపోయింది.
అందువలన గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో జరిగిన బంగారు కొనుగోళ్లు మరియు ఈ సంవత్సరం జరిగిన బంగారు కొనుగోళ్లలో భారీ మార్పు చోటు చేసుకుంది. కేవలం ఒక్క సెప్టెంబర్ నెలలోనే 658 శాతం బంగారు కొనుగోలు పెరగడం గమనార్హం. గత సంవత్సరం ఆగస్టు నెలలో బంగారం ఔన్స్ ధర 2072 డాలర్లకు పెరిగింది. ఇప్పటి వరకు ఇదే అత్యధికం. కానీ ఇప్పుడు అది కాస్తా దాదాపు 15 శాతం తగ్గింది.  తద్వారా విదేశాల నుండి భారతదేశానికి తెచ్చుకునే బంగారు క్వాంటిటీ పెరిగిపోయింది.
ఇక మనకు తెలిసిందే దీని ఫలితంగా రూపాయికి మరియు డాలర్ కు తేడా ఇంకా పెరిగిపోయింది. ఇలా పలు కారణంల వలన బంగారం రిటైల్ ధర పెరిగింది. గత సంవత్సరం తో పోలిస్తే ఈ సారి గత నెలలో 91 టన్నుల మేరకు బంగారం దిగుమతి పెరిగాయి. ప్రస్తుతానికి స్థానికంగా గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములు 45,479 రూపాయలకు పడిపోయింది. దేనితో బంగారం ధరల్లో రోజు రోజుకి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నిన్న భారీగా పెరిగిన దారాలుబి నేడు మాత్రం స్వల్పంగా తగ్గాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: