పసిడి ప్రియులకు ఝలక్.. వెండి ధర జిగేల్..!

Satvika
బంగారం ధరలు రోజు రోజుకు పరుగులు పెడుతుంది. నిన్నటి ధరతో పోలిస్తే నేటి ధరలు మార్కెట్ లో భారీగా పెరిగాయి. గత నాలుగు రోజులుగా ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఈరోజు కూడా పసిడి రేటు పైపైకి కదిలింది. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా పయనించింది. బంగారం ధర పెరగడం ఇది వరుసగా రెండో రోజు కావడ గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు పైకి చేరడంతో దేశీ మార్కెట్‌లోనూ ఇదే ట్రెండ్ కొనసాగిందని బులియన్ మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.

హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పైకి కదిలింది. దీంతో రేటు రూ.50,070కు ఎగసింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.90 పెరుగుదలతో రూ.45,900కు ఎగసింది. బంగారం ధర పెరిగితే.. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. పరుగులు పెట్టింది. వెండి ధర పైపైకి కదిలింది. రూ.400 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.72,000కు చేరింది.

వెండి వస్తువులకు డిమాండ్ పెరగడంతో ధరలు పెరిగినట్లు తెలుస్తుంది. అంతర్జాతీయ మార్కెట్‌ లోనూ బంగారం ధర పెరిగింది. 0.35 శాతం పైకి కదిలింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1911 డాలర్ల కు చేరింది. వెండి రేటు కూడా పైపైకి కదిలింది. ఔన్స్‌కు 0.81 శాతం పెరుగుదల తో 28.24 డాలర్లకు పరుగులు పెట్టింది. బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్ తదితర అంశాలు ప్రభావాన్ని చూపిస్తున్నాయి. రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: