పదిలంగా పుత్తడి.. పరుగులు పెట్టిన వెండి..!!
ఇకపోతే హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,860 ఉంది. దేశం లో చోటు చేసుకుంటున్న పలు ఆర్థిక, పలు పరిణామాల వల్ల బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు జరుగుతుంటాయి. ఒక వైపు బంగారం ధరలు స్థిరం గా ఉంటే వెండి ధరలు మాత్రం పెరిగాయి. శనివారం దేశీయం గా కిలో వెండి ధర పై 600 రూపాయల వరకు పెరిగింది.. హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.76,100 గా నమోదు అవుతుంది.
బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. అందుకు ఎన్నో కారణాలున్నాయని బులియన్ మార్కెట్ నిపుణు లు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరల పై ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు...ఈరోజు మహిళల ఆనందానికి అవధులు లేవు.. బంగారాన్ని కొనుగోలు చేయడానికి బారులు తీరారు.. నిన్న పెరిగిన ధరలు పసిడి ధరలు ఈరోజు ఇకపోతే రేపు మార్కెట్ లో పసిడి, వెండి ధరలు ఎలా నమోదు అవుతాయో చూడాలి..