పసిడి ప్రియులకు ఝలక్.. అదే దారిలో వెండి.. !

Satvika
పసిడి ప్రియులకు చేదు వార్త.. బంగారం ధరలు ఈరోజు కూడా భారీగా పైకి కదిలాయి. నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు నేడు ఇంకాస్త పైకి కదిలాయి. కరోనా సెకండ్ వేవ్‌లో సైతం దేశ వ్యాప్తంగా బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగాయి. కరోనా కేసులు, లాక్‌డౌన్, కర్ఫ్యూ ప్రభావం ఉన్నప్పటికీ వెండి ధరలు సైతం పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశ రాజధాని ఢిల్లీలో పసిడితో పాటు వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.. మహిళలకు ఇది చేదు వార్తనే చెప్పాలి.
ఇకపోతే బంగారం ధరలపై ఆధారపడి వెండి ధరలు కూడా అదే దారిలో నడిచాయి. రూ.రూ.270 మేర పెరిగింది. దీంతో నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,980కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,900 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.బులియన్ మార్కెట్‌లో వెండి ధర మూడురోజుల తరువాత పెరిగింది. తాజాగా రూ.500 మేర పుంజుకోవడంతో ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.71,000కి చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.700 మేర స్వల్పంగా పెరిగింది. నేడు హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.76,000 వద్ద మార్కెట్ అవుతుంది.
వెండి ధర పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు కూడా అంటున్నారు. ముఖ్యంగా పరిశ్రమల తయారీ. నాణేల తయారీ ల పై డిమాండ్ పుంజుకోవడం తో ధరలు పైకి కదిలాయి. బంగారం ధర ఔన్స్‌కు 1.11 శాతం పెరిగింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1847 డాలర్లకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం వెండి ధర పెరిగింది. పైపైకి కదిలింది. వెండి ధర ఔన్స్‌కు 1.6 9 శాతం పెరుగుదలతో 27.55 డాలర్లకు చేరింది.. కాగా బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. మరి రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు  ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: