పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వెండి జిగేల్..!

Satvika
పసిడి ప్రియులకు మరో గుడ్ న్యూస్.. నిన్న కాస్త తగ్గిన బంగారం ధరలు నేటి మార్కెట్ లో భారీగా కిందకు దిగి వచ్చాయి. బంగారం కొనే వారికి ఇది గుడ్ న్యూ్స్ అని చెప్పొచ్చు. బంగారం ధర తగ్గితే.. వెండి రేటు మాత్రం వేరే దారిలో నడిచింది. పై పైకి కదిలింది. బంగారం ధరలు తగ్గితే , వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి. గత పది రోజుల క్రితం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇప్పుడు మాత్రం వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు పైకి కదిలాయి..


ఇండియన్ మార్కెట్ లో ధరలు మాత్రం తగ్గుతూ రావడం విశేషం. హైదరాబాద్ మార్కెట్ లో హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 పడిపోయింది. దీంతో రేటు రూ.45,490కు తగ్గింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారి లో నడిచింది. రూ.300 తగ్గుదల తో రూ.41,700కు క్షీణించింది..


బంగారం ధర తగ్గితే వెండి ధరలు మాత్రం కాస్త పెరిగాయి.వెండి ధర రూ.100 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.69,500 కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీ దారుల నుంచి డిమాండ్ పుంజు కోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పు కోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌ లో బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.36 శాతం పెరుగుదల తో 1731 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.25 శాతం పెరుగుదలతో 25.11 డాలర్లకు చేరింది. రోజుకో విధంగా ఉండే బంగారం ధరలు గంటకో విధంగా ఉంటాయి. మరి ఉగాదికి ధరలు ఎలా ఉంటాయో చూడాలి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: