భారీగా పడిపోయిన బంగారం ధరలు.. దూసుకెళ్లిన వెండి..!!

Satvika
బంగారం ధరలు ఇప్పుడు పూర్తిగా పడిపోయాయి. దసరా తర్వాత రెండు రోజులు పై పైకి ఎగిసిన రేట్లు ఇప్పుడు పూర్తిగా పడిపోయాయి. ఈరోజు పసిడి రేట్లు భారీగా తగ్గాయి. దేశీయ మార్కెట్ లో బంగారం ధరలు కిందకు దిగడంతో హైదరాబాద్ మార్కెట్ లో రేట్లు పూర్తిగా దిగి వచ్చాయని తెలుస్తుంది. పసిడి పడిపోయింది. బంగారం ధర దిగొచ్చింది. భారీగానే తగ్గింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు.. పసిడి ధరలు కిందకు దిగి వచ్చిన కూడా వెండి ధరలు మాత్రం దూసుకెళ్తున్నాయి..

నిన్నటి రేట్లు చూస్తే 24 క్యారెట్లు 10 గ్రాముల కు రూ.51,650 కు తగ్గగా, 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.70 దిగొచ్చింది. దీంతో ధర రూ.47,340కు దిగింది. ఈరోజు రేట్ల విషయానికొస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.570 తగ్గుదలతో రూ.51,650కు క్షీణించింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.530 దిగొచ్చింది. దీంతో ధర రూ.47,340కు పడిపోయింది.  దీంతో రేట్లు మరింతగా తగ్గుతున్నాయని ధరలు చూస్తే అందరికీ తెలుస్తుంది..

బంగారు రేట్ల దారిలోనే పయనిస్తున్న వెండికి గత మూడు రోజులుగా పెరుగుతున్నాయి. ఈరోజు కిలో ధరకు .3100 పరుగులు పెట్టింది. దీంతో వెండి ధర రూ.65,200కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం తో రేటు ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నాయి. వెండి రేటు రోజు రోజు పెరుగుతూ వస్తుంది.. దీంతో బంగారం కొనుగోలు భారీగా పెరుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం, వెండి ధరల లో వెండి ధర పెరుగుతూ వస్తుంది.. రేపటికి వెండి ధరలు తగ్గుతాయో , ఇంకాస్త పెరుగుతాయో చూడాలి.. బంగారు ధర మాత్రం ఇంకా తగ్గే అవకాశం ఉందని నిపుణులు వెల్లడించారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: