బంగారం: భారీగా పతనమైన బంగారం ధర.. వెండి మరి దారుణం!

Durga Writes

బంగారం ధరలు ఎలా ఉంటాయో అర్థం కాదు.. మొన్నటి వరుకు కరోనా వైరస్ కారణంగా అతి భారీగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు భారీగా తగ్గుతున్నాయి.. నిన్నటికి నిన్న ఏకంగా మూడు వందలు తగ్గినా బంగారం ధర ఈరోజు మరో నాలుగు వందలు తగ్గింది.. అయితే బంగారం ధరలు ఇప్పుడు తగ్గినప్పటికీ మళ్లీ పెరుగుతున్నాయి. 

 

ఇలా తగ్గుతూ పెరిగే బంగారం ధరలు ఈరోజు ఎలా ఉన్నాయి అనేది చుడండి.. నేడు హైదరాబాద్ మార్కెట్ లో నేడు హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 420 రూపాయిల తగ్గుదలతో 43,380 రూపాయలకు చేరింది. ఇంకా ఇదే నేపథ్యంలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 230 రూపాయిల తగ్గుదలతో 39,810 రూపాయలకు చేరింది. 

 

ఇలా బంగారం ధరలు భారీగా తగ్గగా వెండి ధర అతి దారుణంగా తగ్గింది. దీంతో నేడు కేజీ వెండి ధర 430 రూపాయిల తగ్గుదలతో 40,710 రూపాయలకు చేరింది. ఇలా నేడు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. అయితే ఈ ధరలు ఎంత తగ్గినప్పటికీ కొనే అవకాశం మాత్రం లేకుండా పోయింది అనే చెప్పాలి. ఎందుకంటే కరోనా వైరస్ నియంత్రణకై దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: