అమెరికా చదువులు..తల్లిదండ్రులకు మిగిలిస్తున్న కన్నీళ్లు.!?

FARMANULLA SHAIK
* డాలర్లపై ఆశతో అమెరికా వైపు చూస్తున్న యువత..!
* సగటున నెలకు ఒకట్రెండు మరణాలు.!
* తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిలిస్తున్న అమెరికా చదువులు.!

ప్రాచీన కాలంలో చదువుల తల్లి కొలువుతీరింది మన భారత్ లోనే అనేది ఎంత నిజమో నేటి కాలంలో మాత్రం ఉన్నత విద్య అంటే అమెరికా అన్నట్టుగా పరిస్థితిమారిపోయింది. పదులు వందల్లో కాదు అమెరికాలో అక్కడ 50 రాష్ట్రాల్లో దాదాపు ఆరువేల యూనివర్సిటీలు ఉన్నాయి అందుకే అక్కడ టాప్ 200 యూనివర్సిటీలలో సీట్ వచ్చిన అవి మంచివే అనే అభిప్రాయం ఉంది.కానీ అక్కడ ఏ యూనివర్సిటైనా మన అవసరాలు వదరులకే టాప్ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందన్న సంగతి భారతీయ విద్యార్థులు మర్చిపోతున్నారు.కాకపోతే వీటన్నింటి కోసం వెచ్చించే మొత్తం కూడా అధికంగా ఉంటుంది అది మరింత పెరగటమే ఇప్పుడు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తుంది.అమెరికాలో బెస్ట్ యూనివర్సిటీలో ఎక్కడ చదువుకున్నా కూడా చదువుకు మించిన అనుభూతులు,అనుభవాలు పొందుతూ ఒక్కోసారి వారి తల్లిదండ్రులకు ఆనందాన్ని, బాధను కూడా మిగిలిస్తున్నారు.
రెండు, మూడు దశాబ్దాల క్రితం అమెరికా చదువులంటే గొప్ప.. ఎక్కడో ఊరికి ఒకరు లేదా ఇద్దరు చదువుల నిమిత్తం  అమెరికాకు వెళ్లేవారు. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తీగా మారిపోయింది. మన తెలుగు రాష్ట్రాలలో  ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువ అవ్వడంవల్ల ఒకరికి మించి ఒకరు అటానమస్ స్టేటస్ తెచ్చుకొని పిల్లల్ని తమ కాలేజీ ల వైపు ఆకర్షించేలా చేస్తున్నారు. ఏదో రకంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు అమెరికా కలలని సహకారం చేసుకోవాలనే లక్ష్యంగా అమెరికా వైపు పరుగులు పెడుతున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులపై అవగాహన లేకుండా ఇలాంటి కలలు కనడం పొరపాటే అవుతుంది.ఒకప్పుడు అమెరికాలో సీటు రావడం అంటే మెరిట్ విద్యార్థులకు మాత్రమే అవకాశాలు ఉండేవి.
ప్రస్తుతంఅమెరికా విద్యారంగంలో విద్యార్థుల ఫీజుల నుండి వస్తున్నటువంటి ఆదాయం భారీగా ఉండడంతో అమెరికా కన్సల్టెన్సీలు వీసాలుఇవ్వడం అనేది సులభతరం చేసింది దాంతో ఇలాంటి విద్యార్థి కైనా సరే ఏదో ఒక యూనివర్సిటీలోసీట్ వస్తుంది.అయితే తల్లిదండ్రులు విద్యార్థుల భవిష్యత్తు కోసం లక్షలు ఖర్చుపెట్టిఅమెరికాకు పంపుతుంటే ఈమధ్య ఎక్కువగా తల్లిదండ్రులకు వారి పిల్లల మరణ వార్తల విని కన్నీరు మున్నీరు అవుతున్నారు.చదువు పూర్తయిందనో, కొద్దిగా విరామ సమయం దొరికిందనో,  ఉద్యోగం వచ్చిందనో వివిధ కారణాలతో పిల్లల హఠాత్ మరణాలు తల్లిదండ్రుల పాలిట తీరని ఆవేదనను మిగులుస్తున్నాయి. డాలర్లకు ఆశపడి పిల్లలు వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసుకుంటున్నారు. గత రెండు మూడేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో  కనీసం నెలలో రెండు నుంచి మూడు తెలుగోళ్ళ మరణాలు సంబంధించినట్లు తెలుస్తుంది.
అయితే అలాంటి సంఘటనలు జరిగిన వాటిలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సూర్య అవినాష్ ఒకరు.అమెరికాలో చదువుతున్న అవినాష్ వాటర్‌ఫాల్స్‌ చూసేందుకు వెళ్లి అందులో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు.అలాగే శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన పెదిని రూపక్‌రెడ్డి కూడా ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లి సరదాగా బోటులో విహరిస్తూ.. సరస్సు మధ్యలో ఉన్న రాయిపై ఎక్కి ఫొటోలు దిగుతుండగా నీటిలో పడి చనిపోయారు.ఈవిధంగా కారణాలు ఏవైనా చదువుల తల్లీ సరస్వతి పిలించిందని అమెరికాకు వెళ్ళి వారి వారి తల్లిదండ్రులకు తీరని దుఃఖన్ని మిగిలిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: