తెలంగాణ విద్యార్థులకు సూపర్ గుడ్ న్యూస్?

Purushottham Vinay
ఇక తెలంగాణ రాష్ట్రం బాగా డెవలప్ అవుతుంది.ప్రగతి పథంలో స్పీడ్ గా దూసుకుపోతుంది.ఇంకా అలాగే అటు అభివృద్ధికి, ఇటు సంక్షేమానికి సమపాళ్లలో ప్రాధాన్యత ఇస్తూ ముందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ గా ముందుకు సాగుతోంది. విద్య, వైద్యంపై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాన ఫోకస్ పెట్టడం జరిగింది.మంత్రి హరీశ్ రావు నేతృత్వంతో వైద్యారోగ్య ఆరోగ్య శాఖలో అనేక విప్లవాత్మక మార్పులు కూడా వచ్చాయి. ఇంకా అలాగే ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు కూడా పెరిగాయి.తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగంలో  మంచి మార్పులు వస్తున్నాయి.పెద్ద పెద్ద కార్పోరేట్ స్కూళ్లకు ఏమాత్రం తగ్గకుండా ప్రభుత్వ పాఠశాలల్లో అనేక రకాల మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి కార్పొరేట్‌ స్కూళ్ల లాగానే ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు కూడా మంచి యూనిఫామ్‌ అందించాలని పాఠశాల విద్యాశాఖ డిసైడయ్యింది.మొత్తం 5 కొత్త డిజైన్లతో పిల్లలకు యూనిఫామ్స్ ఇవ్వనున్నారు.


ఎనిమిది నుంచి ఆపై తరగతుల అబ్బాయిలకు ప్యాంట్లు ఇంకా కింది తరగతుల వారికి నిక్కర్లు ఉంటాయి. 1 నుండి 3 తరగతి దాకా ఉన్న బాలికలకు అయితే చెక్డ్ షర్ట్, రెండు జేబులతో కూడిన మెరూన్ స్కర్ట్ అనేది ఉంటుంది. ఇక ఆపై తరగతుల వారికి కుర్తా, మెరూన్ పైజామాపై మెరూన్ వెయిస్ట్‌కోట్ అనేది ఉంటుంది. మొత్తం 26 వేల స్కూళ్లలోని 25 లక్షల స్టూడెంట్స్‌కు ఈ యూనిఫామ్ ని అందించనున్నారు.ఇక ఇందుకోసం గాను సుమారు రూ.145 కోట్ల డబ్బుని ఖర్చు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం.ఇంకా అలాగే 1-8 క్లాసుల స్టూడెంట్స్‌కు అయ్యే వ్యయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం 60:40 రేషియోలో ఖర్చును భరిస్తాయి. అలాగే తొమ్మిది, పది తరగతుల వారితోపాటు KGBV ఇంకా అలాగే ఆదర్శ పాఠశాలల్లో 12వ తరగతి దాకా స్టూడెంట్స్‌కు పూర్తిగా రాష్ట్ర నిధులతో ఇస్తారు. స్కూల్స్ రీ ఓపెన్ నాటికే వాటిని విద్యార్థులకు అందించాలని గట్టి టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పటికే వస్త్ర సేకరణకు టెస్కోకు ఆర్డర్‌ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: