NEET 2022 : వాయిదా వేయాలని అభ్యర్థుల డిమాండ్!

Purushottham Vinay
దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం ప్రవేశ పరీక్షగా నీట్‌ పరీక్షని నిర్వహిస్తున్నారు.జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక పరీక్షల్లో ఇది ఒకటి. ఈ సంవత్సరం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్- యూజీ (NEET- UG) ను జూలై -17న నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ పరీక్షను వాయిదా వేయాలని చాలా మంది అభ్యర్థులు కూడా డిమాండ్ చేస్తున్నారు. సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు జూన్ 15 దాకా జరగనున్నాయి. ఇక దీంతో నీట్‌ కోసం ప్రిపేర్ కావడానికి సమయం తక్కువగా ఉంటుందని అభ్యర్థులు వాపోతున్నారు. కాబట్టి నీట్‌ పరీక్షను ఆగస్ట్ నెల చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారానికి వాయిదా వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.ఇక అంతేకాకుండా జాతీయస్థాయిలో జరిగే అనేక ప్రవేశ పరీక్షలు కూడా క్లాష్ అవుతున్నాయని విద్యార్థులు అంటున్నారు. అలాగే నీట్-2022తో పాటు కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) కోసం కూడా దరఖాస్తు చేసుకునే వారికి ప్రిపరేషన్ కావడానికి చాలా తక్కువ సమయం ఉంటుందని విద్యార్థులు పేర్కొనడం జరిగింది. CUET 2022 జూలై నెల మొదటి లేదా రెండో వారంలో జరుగుతుంది. దీంతో మెడికల్ ఎంట్రన్స్‌కు ప్రిపేర్ కావడానికి కొన్ని రోజుల సమయం ఉండడంతో తమపై బాగా ఒత్తిడి పెరుగుతుందన్నారు. ఇక ఈ కారణంగానే జేఈఈ మెయిన్‌ వాయిదా పడిన విషయాన్ని విద్యార్థులు హైలైట్ చేస్తున్నారు. నీట్ పరీక్ష వాయిదా కోసం విద్యార్థులు అనేక మార్గాల్లో ప్రయత్నాలు ముమ్మరం చేశారు.


ఇక నీట్ పరీక్షను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేస్తూ పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కేంద్ర విద్యాశాఖకు లేఖలు రాశారు. అలాగే విద్యార్థుల విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నీట్‌ను వాయిదా వేయాలని లేఖ ద్వారా కోరారు.NEET -2022 పరీక్ష విధానంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి నిబంధనను కూడా తొలగించారు. దీంతో ఈసారి ఎక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అందువల్ల పోటీ మరింత తీవ్రం కానుంది. దీన్ని బ్యాలెన్స్ చేయడం కోసం అదనంగా 20 నిమిషాల సమయంని కూడా కేటాయించనున్నారు. దీంతో మొత్తంగా 3 గంటల 20 నిమిషాల పాటు నీట్ పరీక్ష అనేది జరగనుంది. ఇక ఆన్‌లైన్‌లో జరిగే ఈ పరీక్ష ప్రశ్నాపత్రం మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉండనుంది. కొత్త మార్కింగ్ విధానం ప్రకారం పత్రి తప్పు సమాధానికి కూడా ఒక మార్క్‌ను తీసివేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: