24 జిల్లాల్లో ఇంటర్ పరీక్ష రద్దు... నిరాశలో విద్యార్థులు?

VAMSI
ఇంటర్ విద్యార్దులకు ముఖ్య గమనిక... జరగాల్సిన ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది యూపీ రాష్ట్ర ప్రభుత్వం. పేపర్ లీక్ అవడం తో పరీక్షలను రద్దు చేస్తూ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది అక్కడి విద్యా శాఖ. ఇది ఉత్తరప్రదేశ్ కి సంబందించిన వార్త. పేపర్ లీక్ అవడం ఒకవేళ ఆ విషయం కనుక వెళ్ళడైతే అధికారులు పరీక్షలను రద్దు చేయడం తరచూ చూస్తూనే ఉంటాం. కాగా తాజాగా ఇలాంటి సమస్యే ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో ఇంటర్‌ సెకండ్ ఇయర్ పాలీ ఇంగ్లీష్‌ పరీక్షను రద్దు చేస్తున్నట్లు అక్కడి విద్యాశాఖ ప్రకటన చేసింది. ఉత్తర ప్రదేశ్ లోని బల్లియా అనే జిల్లాలో పేపర్ లీక్ అయిన విషయం తెలియడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ  కారణంగా రాష్ట్రంలోని 24 జిల్లాల్లో 12వ ఇంగ్లీష్ పేపర్ రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. స్వలాభం కోసం విద్యను మార్కెట్లో అమ్మేస్తున్నారు కొందరు... ఈ క్రమంలో ఇంటర్‌ సెంకడ్‌ ఇయర్‌ ఇంగ్లీష్ పేపర్‌ను మార్కెట్‌లో రూ.500 కి విక్రయిస్తున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే యాక్షన్ తీసుకున్నారు. పోలీసులు సైతం ఈ అంశం పై విచారణ చేపట్టారు. కాగా విషయం తెలుసుకున్న యూపీ బోర్డు  ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ పేపర్ సిరీస్ 316 ఈడీ, 316 ఈఐలను రద్దు చేయాలని ఆదేశించింది. దాంతో సదరు అధికారులు జిల్లా మేజిస్ట్రేట్‌.. 24 జిల్లాల్లోని అన్ని కేంద్రాల్లో ఇంటర్ సెకండ్ పాలీ ఇంగ్లీష్ పరీక్షను ప్రస్తుతానికి రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
పరీక్ష మళ్ళీ ఎపుడు ఉండబోతుంది అన్న వివరాలు వీలైనంత త్వరగా వెల్లడిస్తామని పేర్కొన్నారు. పేపర్ లీక్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకోవలసిందిగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో యూపీ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ విషయంపై ఆయా జిల్లాల విద్యార్థులు పూర్తి నిరాశలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: