నిరుద్యోగులకు కేసీఆర్ గుడ్‌న్యూస్.. ఒకదాని తర్వాత ఒకటి?
కేసీఆర్ ఆ కమిటీకి సూచించారు.
నోటిఫికేషన్లు అన్నీ ఒకేసారి కాకుండా.. ఒక దాని తర్వాత ఒకటి చొప్పున జారీ చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. అన్ని ఏర్పాట్లు చేశాకే నోటిఫికేషన్లు విడుదల చేయాలని సీఎస్‌కు సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉద్యోగాల భర్తీ జరగాలని సీఎం కేసీఆర్ సీఎస్‌కు సూచించారు. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్రస్థాయి నియామకాల కమిటీ ఒకటి, రెండు రోజుల్లో సమావేశం కానుంది. నోటిఫికేషన్ల జారీ తేదీలను నిర్ణయించి.. సీఎంకు ప్రతిపాదించే అవకాశం కనిపిస్తోంది.
ఇప్పుడు వస్తున్న ఉద్యోగాల భర్తీలో అన్నీ దాదాపు డిగ్రీ అర్హతతో వచ్చే ఉద్యోగాలే ఉంటాయి. నోటిఫికేషన్లన్నీ ఒకేసారి వస్తే.. అన్ని పరీక్షలకు నిరుద్యోగులు ప్రిపేర్ కావడం కష్టం అవుతుంది. అందుకే ముఖ్యమైన పరీక్షలు... ఒకదాని తర్వాత ఒకటి నిర్వహిస్తే.. నిరుద్యోగులు అన్ని పరీక్షలు రాసే వెసులుబాటు ఉంటుంది. ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే ఇవ్వాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించిన నేపథ్యంలో వారం, పది రోజుల్లోనే కొన్ని నోటిఫికేషన్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
మొత్తం 10 రోజుల్లో కనీసం 30 వేల ఉద్యోగాల వరకూ నోటిఫికేషన్లు ఇవ్వాలని కమిటీ భావిస్తోంది. దశలవారీగా మిగిలిన పోస్టుల భర్తీ చేపట్టాలని కమిటీ భావిస్తోంది. కేసీఆర్ గుడ్ న్యూస్ చెబుతా అని ఊరించి మరీ అసెంబ్లీలో ఉద్యోగాల ప్రకటన చేసినప్పటి నుంచి నిరుద్యోగులు ఆశగా నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ప్రకటించి ఇన్ని రోజులైనా ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు.