హ్యాపీ న్యూఇయర్ 2022 : ఇంగ్లీషోడి పండుగకు తెలుగోడి సోకు! ఎల్లెహే!
పరదేశీ సంస్కృతి వేరు
కానీ ఎప్పటి నుంచో
మనది కాని వేడుకకు
విపరీతం అయిన సందడి ఉంటోంది
కానీ మన పండుగలు మాత్రం
మన సంస్కృతికి సంప్రదాయానికి దూరం
అయి ఉంటున్నాయి.. తప్పదు ఇది
విష సంస్కృతి వద్దనుకుని ఏ సంస్కృతిలో అయినా
మంచిని తీసుకుని ముందుకు వెళ్లడం ఓ గొప్ప పని!
గుడికి వెళ్లి దీవెనలు అందుకోవడంలో ఎంతో మేలు ఉంది. దేవుడి దీవెనలకు ఇంగ్లీషోడి పండుగ.,తెలుగోడి పండుగ అన్న తేడా అన్నదే ఉండదుజ. కానీ సంస్కారం వదిలి తాగి తూలి రోడ్లమీద గెంతడంలో ఆనందం కన్నా విషాదమే ముందుంది. కనుక తాగడం సంస్కృతి కాదు.. స్థాయి మరచి వాగడం కూడా మన సంస్కృతి కాదు కనుక ఎవరి జాగ్రత్తలలో వాళ్లుంటేనే బెటర్. అప్పుడు ఎవ్వరి పండుగ అయినా ఎవ్వరైనా చేసుకోవచ్చు. అప్పుడు అతి చేయడం గతి చెడడం అన్నవి ఉండనే ఉండవు. కానీ మన దగ్గర విష సంస్కృతి వ్యాప్తి తప్ప ఇతరం అయిన ధ్యాస ఏమీ ఉండదు. కనుక తాగడం తప్పు.. తాగి తూలడమూ తప్పు.. బాధల్లో ఉంటూ పండుగ చేసుకోవడం ఇంకా తప్పు. ఇవన్నీ తెలుగు పండుగల్లో ఉన్నాయా లేవా అన్నది తరువాత చర్చ.. పక్కింటోడి పండుగ చేసుకోవడం తప్పు కాదు కానీ అదుపు తప్పి ప్రవర్తించడమే తప్పు. నేరం కూడా!
రాత్రి ఎంతకు ఇంటికి వెళ్లారు. 12 గంటల తరువాత తాగి తాగి వెళ్లాల్సిన అగత్యం ఏముందని? పక్కింటోది పండుగకు మనం ఎందుకు బ్యాండ్ బాజా మోగించాలి? ఇలాంటివి ఎన్నో వినిపిస్తున్నాయి. అయినా తాగి తూలి ప్రభుత్వాలకు ఆదాయాలు ఇవ్వమని ఈ పండుగలు ఏమయినా చెప్పాయా? బొత్తిగా కరోనా భయం లేకుండా పోయిందే ? ఇలాంటివెన్నో వినిపిస్తున్న ప్రశ్నలు.. లెక్కకు మిక్కిలి ప్రశ్నలు.
పండుగలు ఏమయినా ఆనందాలకు ప్రతీకలు.. సంస్కృతులు ఏమయినా మనందరి ప్రేమకు చిహ్నాలు.. కలిసి ఉండే కలదు సుఖం అనేందుకు తార్కాణాలు. సంస్కృతులు వేరయినా మనందరం ఒక్కటే అన్న భావనకు చిహ్నం భారతదేశం. రెండు విభిన్న సంస్కృతులు కారణంగా మనం అటు పాశ్చాత్య ధోరణులకు అలవాటు పడిపోయి ఇటు స్వదేశీ సంస్కృతిని వదిలేస్తున్నాం అని అంటున్నారు సత్సంప్రదాయ వాదులు.