నిరుద్యోగులకు శుభవార్త.. IRCTC లో ఖాళీలు..

Purushottham Vinay
నిరుద్యోగులకు శుభరాత్రి.2021 వ సంవత్సరానికి గాను irctc రిక్రూట్‌మెంట్ విడుదల అవ్వడం జరిగింది. irctc నుంచి 100 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి, 10 వ తరగతి పాస్ అయిన వారందరూ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక వివరాలలోకి వెళితే..గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవసరం లేని ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువ భారతీయులకు ఇది ఒక మంచి సువర్ణావకాశం అనే చెప్పాలి. ఇక ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కంప్యూటర్ ఆపరేటర్ ఇంకా అలాగే ప్రోగ్రామింగ్ అసిస్టెంట్‌గా అప్రెంటీస్‌షిప్ కోసం 100 ఖాళీల కోసం దరఖాస్తులను ఆహ్వానించడం జరిగింది. దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లో జరుగుతుంది ఇంకా పోస్ట్‌పై ఆసక్తి ఉన్నవారు అధికారిక వెబ్‌సైట్: apprenticeshipindia.org వెబ్ సైట్ ని సందర్శించడం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇక అలాగే విద్య ఇంకా మరిన్ని అర్హతల విషయానికి వస్తే..ఆసక్తి ఉన్న అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10 వ తరగతి లేదా ఏదైనా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఉన్నత విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, లింగం, మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడి వంటి అన్ని ప్రాథమిక వివరాలతో నమోదు చేసుకోవాలి. మరియు పాస్వర్డ్, ఆపై irctc లో 100 ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోసం దరఖాస్తును సమర్పించండి. అభ్యర్థిని షార్ట్‌లిస్ట్ చేసినట్లయితే, వారికి 500 గంటల శిక్షణ ఇవ్వబడుతుంది మరియు దీని తర్వాత, వారికి 12 నెలల ఉద్యోగ శిక్షణ ఇవ్వబడుతుంది.ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ .7,000-9,000 స్టైఫండ్ ఇవ్వబడుతుంది ఇంకా వారానికి 6 రోజులు  పని చేయాల్సి ఉంటుంది.ఇక ఇంకెందుకు ఆలస్యం ఆసక్తి ఇంకా అర్హత వున్న అభ్యర్థులు వెంటనే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: