చదువులో బాగా రాణించాలనుకుంటున్నారా? అయితే ఇలా చెయ్యండి..

Purushottham Vinay
పిల్లల చదువుల విషయమై కొందరు సైంటిస్ట్‌లు పలు పరిశోధనలు నిర్వహించడం జరిగింది. ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా వ్యాయామం చేసే పిల్లలు ఇంకా వ్యాయామం చేయని పిల్లలకు సంబంధించి వారు చదువుల్లో ఎలా రాణిస్తున్నారు అనే విషయాలను అడిగి తెలుసుకోని పరిశోధన చెయ్యడం జరిగింది. రోజు కూడా కనీసం 60 నిమిషాల పాటు వ్యాయామం చేసే పిల్లలు చాలా చురుగ్గా ఉండి చదువుల్లో చాలా బాగా రాణిస్తారని సైన్టిస్టులు తెలుసుకున్నారు. అందువల్ల పిల్లల్ని ప్రతి రోజూ కూడా క‌నీసం 60 నిమిషాల పాటు అయినా వ్యాయామం చేసేలా వారికి అలవాటు చెయ్యాలని వ్యాయామం చెయ్యకపోయినా కనీసం ఆటలు ఆడుకునేందుకు పెద్దలు వారిని అనుమతించాలని సైంటిస్ట్లు సూచిస్తున్నారు.అలాగని మరీ ఎక్కువ సేపు వ్యాయామం అనేది చెయ్యకూడదట. ఎందుకంటే మితిమీరిన శారీరక శ్రమ వల్ల చిన్న వయసులోనే అనేక గుండె సంబంధిత వ్యాధులు ఇంకా ఎముకలు త్వరగా ఫ్రాక్చర్ కావడం వంటి సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం కూడా ఉందట.

ఇక అందువల్ల రోజు మొత్తంలో ఉదయం ఒక 30 నిమిషాలు అలాగే సాయంత్రం మరో 30 నిమిషాల పాటు పిల్లలతో రోజు వ్యాయామం చేయిస్తే పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఇంకా షార్ప్ గా కూడా ఉంటారట.ఇక అలాగే చిన్నతనంలో పిల్లలు శారీరక వ్యాయామం అనేది చేయడం వల్ల వారు పెరిగి పెద్దయ్యాక శారీరకంగానూ ఇంకా అలాగే మానసికంగానూ ఎంతో ఆరోగ్యంగా ఉంటారట. ఇక ముఖ్యంగా బాల్యం తరువాత వచ్చే యంగ్ ఏజ్ లో పిల్లలు రోజు వ్యాయామం చేస్తే వృత్తి రీత్యా వారు ఎటువంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా చాలా ఆరోగ్యంగా ఉంటారట.ఇక అంతేగాక మిడిల్ ఏజ్‌లో వారికి ఎలాంటి గుండె సంబంధిత జబ్బులు ఇంకా అలాగే ముసలితనంలో అల్జీమర్స్ వ్యాధులు అనేవి అసలు రాకుండా ఉంటాయట.ఇక వ్యాయామం పిల్లల మెదడు పెరుగుదలను కూడా ప్రేరేపిస్తుంది. అలాగే పిల్లలు ఇంట్లో ఆహారం కంటే కూడా బయటి దొరికే ఫుడ్తోనే ఎక్కువగా కడుపు నింపేసుకోని తమ ఆకలిని తీర్చుకుంటున్నారు. జంక్ ఫుడ్ తిని వ్యాయామం చేసిన కాని ఏమాత్రం లాభం ఉండదు.అందుకే పిల్లలకు జంక్ ఫుడ్ను దూరంగా ఉంచాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: