నిరుద్యోగులకు శుభవార్త.. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో ఖాళీలు..

Purushottham Vinay
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) 269 కానిస్టేబుల్ పోస్టుల (జనరల్ డ్యూటీ) స్పోర్ట్స్ కోటా కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు BSF rectt.bsf.gov.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ వచ్చేసి ఆగస్టు 9, 2021 న ప్రారంభమవుతుంది. ఇక నియామకానికి దరఖాస్తు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 22.
పే స్కేల్: 21700- 69100/- (లెవల్ -3) ఇంకా నియమం ప్రకారం ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అనుమతించదగిన ఇతర అలవెన్సులు అనేవి ఉంటాయి.
BSF కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2021 అర్హత విషయానికి వస్తే..గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుంచి 10 వ తరగతి లేదా మెట్రిక్యులేషన్ పూర్తి చేసి పాస్ అయ్యి ఉండాలి.
మొత్తం ఖాళీల సంఖ్య : 269 ఖాళీలు వున్నాయి.
వయోపరిమితి: 18 నుంచి 23 ఏళ్లు ఉండాలి.
ఏదైనా అంతర్జాతీయ స్పోర్ట్స్ ఈవెంట్‌లు లేదా నేషనల్ గేమ్స్ లేదా ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న లేదా పతకం సాధించిన క్రీడాకారులు ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చు.
హైట్ : మగవాళ్ళు = 170 సెం.మీ ఉండాలి,స్త్రీ = 157 సెం.మీ ఉండాలి.
చెస్ట్ (మగవారికి ): 80 సెం.మీ ఉండాలి. కనీస విస్తరణ వచ్చేసి - 05 సెం.మీ ఉండాలి.
బరువు: ఆడ, మగ అభ్యర్థులకు వైద్య ప్రమాణాల ప్రకారం ఎత్తు ఇంకా వయస్సుకి తగ్గట్లు ఉండాలి.
ఎలా దరఖాస్తు చేయాలి: ఆసక్తి గల అభ్యర్థులు ఆగష్టు 9 నుండి సెప్టెంబర్ 22, 2021 వరకు అధికారిక వెబ్‌సైట్ rectt.bsf.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ: టెస్టిమోనియల్స్/డాక్యుమెంట్‌ల చెకింగ్ , ఫిజికల్ స్టాండర్డ్ (PST) ఇంకా డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ (DME) ఆధారంగా ఎంపిక చేయబడుతుంది.

ఇక ఇంకెందుకు ఆలస్యం ఆసక్తి ఇంకా అర్హత కలిగిన అభ్యర్థులు ఈ బోర్డర్ సెక్యూరిటీ జాబ్స్ కి అప్లై చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

bsf

సంబంధిత వార్తలు: