పదోతరగతి తో రైల్వే ఉద్యోగాలు..పరీక్షలేకుండానే

నిరుద్యోగులకు భారతీయ రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ముంబై కేంద్రంగా ఉన్న సెంట్రల్ రైల్వే లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో మొత్తం 2532 అప్రెంటిస్ పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తిగల విద్యార్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అయితే ఏ పోస్టులకు ఎలాంటి రాతపరీక్ష లేకుండానే ఎంపిక చేస్తారు. కానీ ఇంటర్వ్యూ, అకడమిక్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు సెంట్రల్ రైల్వే పరిధి లోని పూణే, నాగ్ పూర్, భూసావల్, షోలాపూర్ డివిజన్లలో పని చేయాల్సి ఉంటుంది. మొత్తం 2532 ఖాళీలు ఉండగా.. క్యారేజ్ అండ్ వాగన్ డిపో, వ్యాగన్ వాడి బంధర్-469, ముంబై కళ్యాణ్ గీజిల్ షేడ్ 53, కుర్లా డీజిల్ షెడ్ 60, సీనియర్ డీ371, పారెల్ వర్క్ షాప్ 418,ఎస్ అండ్ టీ వర్క్ షాప్ 547, మన్మడ్ వర్క్ షాప్ 51, డీజిల్ లోకో షెడ్ పూణే 49, ఎలక్ట్రికల్ లోకొషేడ్ నాగపూర్ 48, అజ్ని క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో 66, కుర్ద్ వాడి వర్క్ షాప్ షోలాపూర్ 21 చొప్పున పోస్టులు ఉన్నాయి.

వీటిని అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా కేటాయిస్తారు. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదోతరగతి లేదా దానికి సమానమైన పరీక్ష లో యాబై శాతం మార్కులతో పాస్ అయ్యి వుండాలి. అంతహె కాకుండా ఎన్టీవీసీ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. కాగా ఈ ఉద్యోగాలకు టెన్త్ మరియు ఐటిఐ లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆశావహులు ఆన్లైన్ లో ధరకాస్తూ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అభ్యర్థులు 15 నుండి 25 ఏళ్ల లోపు వయస్సు కలిగినవారు అయ్యుండాలి. ఫిబ్రవరి 6 నుండి మార్చ్ 5 2021 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.https//www.rrccr.com/ అనే వెబ్ ద్వారా అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: