వచ్చే ఐదేళ్ళలో 59 వేల కోట్ల రూపాయలతో పోస్ట్ మెట్రిక్ ఉపకారవేతనాలు!
అర్హులైన ఎస్సీ విద్యార్థుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఈ నగదును డీబీటీ విధానంలో బదిలీచేయనున్నారు. ఈ పథకం కింద 2017-18 నుంచి 2019-20 వరకు ఏడాదికి రూ.1100 కోట్ల అందజేయగా.. ప్రస్తుతం ఇది ఐదు రెట్లు పెరిగింది. 2020-21నుంచి 2025-26 వరకు ఏడాదికి దాదాపు రూ.6,000 కోట్ల అందజేయనుంది. దీని వల్ల పదో తరగతిలోపు చదువు మానేసిన 1.36 కోట్ల మంది పేద విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఉపకార వేతనంతో వచ్చే ఐదేళ్లు ఉన్నత విద్యను అభ్యసించే వీలు కలుగుతుందని కేంద్రం భావిస్తోంది. మరోవైపు, 20 ఏళ్ల కాల పరిమితితో డీటీహెచ్ లైసెన్స్‌ను మంజూరు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. అలాగే, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన’ పథకం కింద దేశంలోని 9 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.18 వేల కోట్లను జమ చేయనున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ 25 అటల్ బిహారీ వాజ్‌పేయీ పుట్టిన రోజు సందర్భంగా ఈ సొమ్మును జమ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఇలా వరుసగా కేంద్రం ప్రకటిస్తున్న వరాల పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.