ఈ నెల 30 వరకు 11 వ తరగతి అడ్మిషన్లు జరగనున్నాయి..

Satvika
విద్యార్థుల భవిష్యత్ కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. దాదాపు ఏడాది వృదా అవ్వడంతో విద్యార్థులు భవిష్యత్ మళ్లీ వెనక పడకూడదనే ఆలోచనలో తెలంగాణ సర్కార్ ముందుకు కదులుతుంది.. అందులో భాగంగా ఇప్పటికే  వచ్చే ఏడాదికి విద్యా క్యాలెండర్ ను కూడా విడుదల చేసింది.. అంతేకాదు ఇకమీదట ఏడాది పూర్తయ్యే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు.సెలవుల క్యాలెండర్ ను కూడా సర్కార్ విడుదల చేశారు. లాక్ డౌన్ కారణంగా విద్యా వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయ్యిందని అధికారులు అంటున్నారు.. మళ్లీ ముందు లాగా మారాలంటే ఈ ఏడాది తప్పక భరించాలని సర్కార్ అన్నారు.. అందుకోసమే ఈ ఏడాది లో జరగవలసిన ప్రవేశ పరీక్షలను ముందే నిర్వహిస్తున్నట్లు సమాచారం.. 

అయితే, తెలంగాణలో టెన్త్ పాసైన వారందరికీ కూడా ఇంటర్ లో అడ్మిషన్లు లభిస్తాయని తెలంగాణ విద్యా శాఖ వెల్లడించింది. ఈ మేరకు తెలంగాణ ఇంటర్ అడ్మిషన్ల గడువును కూడా ఇటీవల పెంచారు.. రాష్ట్రంలో ఇంటర్‌ అడ్మి‌షన్ల గడువు తేదీని ఇంట‌ర్మీ‌డి‌యట్‌ బోర్డు మరో‌సారి పొడి‌గిం‌చింది. రాష్ట్రం లోని అన్నీ ప్రయివేటు, ప్రభుత్వ, ఎయిడెడ్‌ కాలేజీలకు ఇది వర్తించనుంది. షెడ్యూల్ ప్ర‌కారం ఈ నెల 16తో గ‌డువు ముగి‌సింది. అయితే ప‌దోత‌ర‌గ‌తి పాసైన విద్యా‌ర్థు‌లం‌ద‌రికీ ఇంట‌ర్‌లో అడ్మి‌షన్లు కల్పిం‌చా‌లనే ఉద్దే‌శం‌తో గడువు తేదీని పొడిగించినట్లు ప్రభుత్వం వెల్లడించింది..

రాష్ట్రంలో 1,300 ప్రైవేటు జూని‌యర్‌ కాలే‌జీలు ఉండగా.. ఇప్ప‌టి‌వ‌రకు 700 కాలే‌జీ‌లకు అఫి‌లి‌యే‌షన్లు ఇచ్చారు. అఫి‌లి‌యే‌షన్‌ నిబం‌ధ‌నల డాక్యు‌మెంట్లు సమ‌ర్పిం‌చని 500 కాలే‌జీల అఫి‌లి‌యే‌షన్లు నిలి‌పి‌వే‌సి‌నట్టు బోర్డు అధి‌కా‌రులు వెల్లడించారు. ఇకపోతే విద్యా సంవత్సరాన్ని ఏప్రిల్ మరియు మే నెలాఖరు వరకు కొనసాగించినా పండగ, ఇతర సెలవులను మినహాయిస్తే 120 రోజుల పనిదినాలు రావాలంటే డిసెంబరులోనే 9, 10 తరగతులతో పాటు ఇంటర్‌ తరగతులు  మొదలుపెట్టాల్సి వస్తుందని తెలంగాణ విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: