సైనిక పాఠశాలల్లో 27 శాతం ఓబీసీ కోటా ఇవ్వనున్నట్లు కేంద్రం నిర్ణయం..

Satvika
సైనిక పాఠశాలల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టు తాజాగా కేంద్రం వెల్లడించింది. 2021-22 విద్యా సంవత్సరం నుంచి ఈ రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు భారత రక్షణ శాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ ఇటీవల ఓ ప్రకటనలో తెలియజేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు, జాతీయస్థాయి విద్యా సంస్థల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తుండగా, సైనిక పాఠశాలల్లోనూ 27 శాతం సీట్లు కేటాయిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ మేరకు రక్షణ శాఖకు చెందిన సైనిక్‌ స్కూల్‌ సొసైటీ పరిధిలో దేశవ్యాప్తంగా 33 పాఠశాలలు ఉన్నట్లు తెలుస్తోంది.. 



అయితే, {{RelevantDataTitle}}