రామ్ చరణ్ హీరోగా గేమ్ ఛేంజర్ మూవీ జనవరి 10 న ఆడియెన్స్ ముందుకు రానుంది. ప్రస్తుతం, ఈ మూవీ టీమ్ ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు.సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ అందర్నీ బాగా ఆకట్టుకుంటున్నాయి.ఇక తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో మొదలైంది. పవన్ కళ్యాణ్ ఛీఫ్ గెస్ట్‌గా రావడంతో అభిమానులతో స్టేడియం కిక్కిరిసిపోయింది. ఈ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రామ్ చరణ్ స్పీచ్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది.ఇదిలావుండగా గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ - చరణ్ మధ్య అనుబంధం హైలైట్ అయింది. రామ్ చరణ్ అంటే రాముని చరణాల వద్ద ఉండే ఆంజనేయుడు అని, నాన్నగారు ఆ పేరు పెట్టారని, పేరుకు తగ్గట్టు ఎంత బలవంతుడైనా వినయ విధేయతలతో రామ్ చరణ్ ఉంటాడని పవన్ తెలిపారు.తన సినిమాల గురించి ఎప్పుడూ చెప్పని పవన్... 'గేమ్ చేంజర్'తో బాక్సాఫీస్ బద్దలు కావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.
రామ్ చరణ్ హీరోలు అందరికీ స్నేహితుడని, ఏడాదికి కనీసం వంద రోజులు అయ్యప్ప మాల లేదా ఆంజనేయస్వామి మాలలో ఉంటాడని, ఆస్కార్ వరకు వెళ్ళినా ఒదిగి ఉండడం చరణ్ తత్వమని పవన్ తెలిపారు.ఈ సందర్భంగా రామ్ చరణ్ నటించిన సినిమాల్లో పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చిన కొన్ని సినిమాలు ఏంటి అనే ప్రస్తావన అయితే ప్రతిసారి వస్తుంది. మరి ఎప్పటికప్పుడు ఈ విషయానికి సంబంధించిన టాపిక్ వస్తున్నప్పటికి రామ్ చరణ్ నటించిన సినిమాల్లో మగధీర, రంగస్థలం సినిమాలు అంటే పవన్ కళ్యాణ్ కి చాలా ఇష్టమని తెలిస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ రెండు సినిమాలంటే అంటే పవన్ కళ్యాణ్ కి చాలా ఇష్టమనే విషయం ప్రతి సారీ ప్రూవ్ అవుతునే వస్తుంది. ఎందుకంటే రామ్ చరణ్ గురించి మాట్లాడాల్సి వచ్చిన ప్రతిసారి ఈ సినిమాల ప్రస్తావన తీసుకు వస్తు మాట్లాడుతూ ఉంటాడు.ఇక రీసెంట్ గా గేమ్ చేంజర్ ఈవెంట్ లో కూడా పవన్ కళ్యాణ్ రంగస్థలం సినిమా గురించి మాట్లాడుతూ ఆ సినిమాలో చరణ్ చాలా బాగా నటించాడు ఆయన నటనకి పెద్ద అవార్డు రావాలి. కానీ రాలేదు అంటూ కొన్ని ఘాటు వ్యాఖ్యలైతే చేశాడు.