ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్‌.. 10,700 జాబ్స్‌ మీ కోస‌మే..!!

frame ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్‌.. 10,700 జాబ్స్‌ మీ కోస‌మే..!!

Kavya Nekkanti

నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్ అందించింది ఏసీ స‌ర్కార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చిన గ్రామ, వార్డు వాలంటీర్ ఉద్యోగాల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్పటికే వేల సంఖ్యలో గ్రామ, వార్డు వాలంటీర్ పోస్టుల్ని భర్తీ చేసింది. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేశారు. గ్రామ,వార్డు వాలంటీర్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. వాలంటీర్లు గైర్హాజరు కావడం, సరిగ్గా విధులు నిర్వహించకపోవడం, ఇంకొందరు ఉద్యోగానికి రాజీనామా చేయడంతో ఖాళీలు ఏర్పడ్డాయి.

 

అయితే ప్రస్తుతం కరోనా వైరస్ సంక్షోభ కాలంలో ఇంటింటికీ సేవల్ని అందించడంలో వాలంటీర్ల పాత్ర కీలకం అని భావించిన ఏపీ ప్రభుత్వం, ఖాళీగా ఉన్న గ్రామ వాలంటీర్, వార్డు వాలంటీర్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్ర‌మంలోనే  10,700 వాలంటీర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మొత్తం ఖాళీలు 10,700 ఉండ‌గా.. గ్రామ వాలంటీర్ 5,200 మ‌రియు వార్డు వాలంటీర్  5,500 పోస్టులు ఉన్నాయి.

 

విద్యార్హ‌త విష‌యానికి 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి. అభ్య‌ర్థికి 2020 జనవరి 1 నాటికి 18 ఏళ్ల నుంచి 35 ఏళ్లు ఉండాలి.  ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అభ్యర్థులు https://gswsvolunteer.apcfss.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేయడానికి 2020 ఏప్రిల్ 24 చివరి తేదీ. కాబ‌ట్టి ఆస‌క్తిక‌ర అభ్య‌ర్థులు వెంట‌నే ద‌ర‌ఖాస్తు ప్రారంభించండి. 

 

ముఖ్య ‌తేదీలు:
నోటిఫికేషన్ విడుదల- 2020 ఏప్రిల్ 20
దరఖాస్తు ప్రారంభం- 2020 ఏప్రిల్ 20
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఏప్రిల్ 24

 

దరఖాస్తుల పరిశీలన- 2020 ఏప్రిల్ 25
ఇంటర్వ్యూ- 2020 ఏప్రిల్ 27 నుంచి ఏప్రిల్ 29
ఎంపికైన వారికి సమాచారం- 2020 ఏప్రిల్ 27 నుంచి ఏప్రిల్ 29

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: