సదరన్ రైల్వేలో ఉద్యోగాలు.. వివరాలు ఇవే..!!
ప్రపంచదేశాలను ప్రస్తుతం కరోనా వైరస్ వణికిస్తుంది. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. కరోనా దూకుడు మాత్రం పెరుగుతూనే ఉంది. దీనికి మందు లేకపోవడంతో నివారణ పైనే అన్ని దేశాలు ఫోకస్ చేశాయి. వైరస్ సోకకుండా ఉండేందుకు.. సోకిన తర్వాత ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వాలు కీలక సలహాలు మరియు సూచనలు ఎప్పటికప్పుడు చేస్తూ వస్తున్నాయి. అలాగే మరోవైపు కరోనాను మట్టుపెట్టేందుకు పలు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్‌డౌన్ ఎన్నో రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
ఈ క్రమంలోనే కొన్ని కంపెనీలు సైతం మూతపడడంతో చాలా మంది ఉద్యోగాలను కోల్పోతున్నారు. అయితే ఇలాంటి సమయంలో సదరన్ రైల్వే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 197 ఖాళీలను భర్తీ చేస్తోంది సదరన్ రైల్వే. చెన్నై, పెరంబదూర్‌లోని రైల్వే హాస్పిటల్‌లో పారామెడికల్ సిబ్బందిని నియమించనుంది. ఇక ఈ ఆస్పత్రిని కరోనా పేషెంట్ల కోసం కేటాయించారు.
అభ్యర్థులను టెలిఫోన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇవి మూడు నెలల తాత్కాలిక పోస్టులు మాత్రమే. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 22 లోగా దరఖాస్తు చేయాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను https://sr.indianrailways.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
ఇక మొత్తం ఖాళీలు 197 ఉండగా.. అందులో నర్సింగ్ సూపరింటెండెంట్ 110, హాస్పిటల్ అటెండెంట్ 68, హేమో డయాలసిస్ టెక్నీషియన్ 4, స్కిల్డ్ ఎలక్ట్రానిక్ టెక్నీషియన్ 2, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2- 4రేడియోగ్రాఫర్ 4, డైటీషియన్ 2, ఫిజియోథెరపిస్ట్ 2 పోస్టులు ఉన్నాయి. అలాగే వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఇక 2020 ఏప్రిల్ 15 నుంచే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం అయింది. 2020 ఏప్రిల్ 22 దరఖాస్తుకు చేయడానికి చివరి తేది. కాబట్టి.. ఆసక్తికర అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి.