డిగ్రీ పాస్ అయిన వారు ఈ గవర్నమెంట్ జాబ్స్ అస్స‌ల మిస్ కాకండి..!!

Kavya Nekkanti

నిరుద్యోగం అనే ఒక బాధతో ఎంద‌రో నిరుద్యోగులు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. నేటి కాలంలో డిగ్రీ ప‌ట్టా చేతిలో ఉన్నా ఉద్యోగం దొర‌క‌ని ప‌రిస్థితి. అయితే డిగ్రీ పాస్ అయిన వారికి ఓ శుభ‌వార్త అందింది. అందులో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునేవారికి ఇది నిజంగా తీపి క‌బురే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. సెంట్రల్ గవర్నమెంట్ వాటర్ బోర్డు-CGWB ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 62 ఖాళీలను ప్రకటించింది. యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. 

 

 జియాలజీ, ఎర్త్ సైన్స్, హైడ్రాలజీ విభాగాల్లో ఈ పోస్టులున్నాయి. జల్ శక్తి మంత్రిత్వ శాఖకు చెందిన నీటివనరులు, నది అభివృద్ధి, గంగ పునరుజ్జీవనం విభాగంలో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. అలాగే మ‌రో విష‌యం ఏంటంటే.. హైదరాబాద్‌ రీజియన్‌లో ఐదు పోస్టులున్నాయి.  ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://cgwb.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

 

దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు ఏప్రిల్ 25 చివరి తేదీ. కాబ‌ట్టి ఆస‌క్తిక‌ర అభ్య‌ర్థులు వెంట‌నే ద‌ర‌ఖాస్తు ప్రారంభించండి. ఇక మొత్తం పోస్టులు 62 ఉండ‌గా.. అందులో యంగ్ ప్రొఫెషనల్ 48 మ‌రియు కన్సల్టెంట్ 14 ఉన్నాయి. విద్యార్హ‌త విష‌యానికి వ‌స్తే.. సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ. కన్సల్టెంట్ పోస్టుకు 10 ఏళ్ల అనుభవం తప్పనిసరిగా ఉండాలి. ఇక దరఖాస్తుల్ని పోస్టు ద్వారా నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి.
  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: