గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ వివిధ రకాల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించింది. ఈ గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ ఆఫర్ చేస్తున్న పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
మొత్తం ఖాళీలు: 43 పోస్టులు.. అవేమిటంటే.. అసిస్టెంట్ మేనేజర్, ఆఫీస్ అసిస్టెంట్, మెరైన్ ఫిట్టర్, వెల్డర్. ఈ ఉద్యోగాలకు ఆయా ఉద్యోగాన్ని బట్టి అర్హతలు ఉన్నాయి. కొన్నింటికి పదోతరగతి, మరికొన్నింటికి సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత అవసరం. కొన్ని ఉద్యోగాలకు అనుభవం అవసరం.
రాతపరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్. ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: ఫిబ్రవరి 04, 2020. ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసేవారు హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేది: ఫిబ్రవరి 15, 2020. మరిన్ని వివరాల కోసం వెబ్సైట్: https://goashipyard.in/ ను పరిశీలించొచ్చు.
మరింత సమాచారం తెలుసుకోండి: