డిగ్రీ విద్యార్థులకు శుభవార్త... TCS సంస్థలో ఉద్యోగాలు మీకోసమే..!

Suma Kallamadi

సాధారణ డిగ్రీ చదివిన విద్యార్థులకు టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తీపి కబురునందించింది. ఈ విద్యాసంవత్సరంలో బీఏ, బీఎస్సీ కోర్సులు పూర్తి చేసుకుంటున్న విద్యార్థులకు కూడా తమ కంపెనీలో ఉద్యోగం పొందే అవకాశాన్ని కంపెనీ కల్పించింది. ఇందుకోసం జాతీయ అర్హత పరీక్ష కంపెనీ నిర్వహించనుంది. తొలి ప్రయత్నంలోనే 2019-20 విద్యా సంవత్సరం కాను రెగ్యూలర్ విధానంలో బీఏ, బీకాం, బీఎస్సీ ఆఖరి సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు కూడా ఈ పరీక్షలు రాయవడానికి అర్హులు.

 

ఇంకా ఈ పరీక్ష రాయలిసిన వారు విద్యాభ్యాసం మొత్తంలో రెండేళ్ల కంటే ఎక్కువగా గ్యాప్ ఉండకూడదు. పెండింగ్ బ్యాక్‌లాగ్స్ అసలు ఉండకూడదు. పడవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ కోర్సులు తొలి ప్రయత్నంలోనే అన్ని సబ్జెక్టులు పూర్తి చేసి ఉండాలి. ఈ పరీక్ష ఎలా ఉంటుంది అంటే... జాతీయ అర్హత పరీక్షలో మొత్తం 50 ప్రశ్నలు ఉంటాయి. వీటికి మొత్తం 50 నిమిషాల వ్యవధిలోనే సమాధానాలు చేయాల్సి  ఉంటుంది. 

 

ఈ పరీక్షలో వెర్బల్ ఎబిలిటీలో నుంచి 10 ప్రశ్నలు, రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి 4, లాజికల్ రీజనింగ్ నుంచి 12, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 12, డేటా ఇంటర్ ప్రిటేషన్ నుంచి 12 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లీష్ గ్రామర్‌ లో ప్రాథమిక పరిజ్ఞానం, వ్యాక్య నిర్మాణం పరిశీలించే ప్రశ్నలు కూడా ఇందులో అడుగుతారు. డిష్కషన్, విశ్లేషణ పరిజ్ఞానం, తదితర ప్రశ్నలు అడుగే అవకాశం ఉంది. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇందులో కనుక క్వాలిఫై విజయవంతమైతే 2020, మే నుంచి టీసీఎస్ కంపెనీలో విధుల్లోకి తీసుకుంటారు. 

 

ఇప్పటికే టీసీఎస్ వెబ్‌సైట్‌లో కంపినీ నమూనా పరీక్షను అందుబాటులో ఉంచారు. పరీక్ష విధానం, ప్రశ్నలతీరు, మరింత సమాచారం ఆ వెబ్‌ సైట్‌ను సందర్శిస్తే పూర్తిగా తెలుసుకోవచ్చు. కాగా, పరీక్షలో నెగ్గి ఎంపికైన వారికి కాగ్నిటివ్ బిజినెస్ ఆపరేషన్స్(సీబీఓ), బ్యాంకింగ్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్స్యూరెన్స్(బీఎఫ్ఎస్ఐ), లైఫ్ సైన్సెస్ విభాగాల్లో శిక్షణ అందించి శాశ్వత ప్రతిపాదికన విధుల్లోకి తీసుకుంటారు కంపినీ యాజమాన్యం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: