గ్రామ సచివాలయ పోస్టులకి టికెట్లు డౌన్లోడ్ చేసుకొండిలా...!!!!
ఏపీ ప్రభుత్వం వన్ సరికొత్త పంథాలో ఏర్పాటుచేసిన
గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ఆయా గ్రామాల నుంచి విపరీతమైన స్పందన లభించింది. 1.6 లక్షల పైగా ఉద్యోగాలకు దాదాపు 21 లక్షలకు పైగా అభ్యర్థులు
దరఖాస్తు చేసుకున్నారు. 2019 సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు ఏపీ గ్రామ సచివాలయ ఉద్యోగులకు పరీక్షలు
నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం.
ఈ పరీక్షలకు అప్లై చేసుకున్న వారు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి వెబ్సైటు లింక్ ను అందుబాటులో ఉంచింది. ఈ వెబ్సైటు లో కేటగిరి 1 , కేటగిరీ 3 పరీక్షల హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. మిగిలిన పరీక్షలకు కూడా త్వరలో హాల్ టికెట్లు వెబ్ సైట్ లోకి అందుబాటులోకి రానున్నాయని తెలిపింది.
గ్రామ సచివాలయ పరీక్షల హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే విధానం
https://gramasachivalayam.ap.gov.in/
ముందుగా ఈ వెబ్సైట్ లింకును ఓపెన్ చేయాలి
- ఓపెన్ చేయగానే హోం పేజీలోని కేటగిరి 1 లో అన్ని పోస్టులతోపాటు కేటగిరీలో 3 డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకు హాల్ టికెట్ లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేస్తే ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- ఇందులో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడి , అప్లికేషన్ ఐడి, లేదా ఆధార్ నెంబర్ ఈ మూడిలో ఏదైనా ఎంటర్ చేసి హాల్ టికెట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు