“కేంద్రం బంపర్ ఆఫర్”....“బీటెక్ విద్యార్ధులకి ఫెలోషిప్”

Bhavannarayana Nch

కేంద్రం ఈరోజు ప్రవేశపెట్టిన 2018- బడ్జెట్ లో ఆర్ధిక శాఖామంత్రి అరుణ్ జైట్లీ విద్యార్ధులకి  ఓ శుభవార్త చెప్పారు..దేశవ్యాప్తంగా  డాక్టరేట్‌ చేయాలనుకునే టాప్‌ బీటెక్‌ విద్యార్థులకు ఫెలోషిప్‌ ఇవ్వనున్నట్టు తెలిపారు..జైట్లీ ప్రకటించిన ఈ ప్రకటనతో విద్యార్ధులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు...ఈ ఫెలోషిప్ ద్వారా ముఖ్యమైన ఐఐటీలో,  ఐఐఎస్‌సీలలో పీహెచ్‌డీ చదివేందుకు అవకాశం లభిస్తుందని తెలిపారు..


ఇదిలా ఉంటే ఆర్థిక సంవత్సరానికి విద్యా బడ్జెట్ కోసం జైట్లీ సుమారు 85,010 కోట్లను  కేటాయించారు. ఇందులో రూ .35,010 కోట్లు ఉన్నత విద్యకు..పాఠశాల విద్య కోసం రూ .50,000 కోట్లు కేటాయించారు..అంతేకాదు వీటితో పాటే సుమారు 24 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. అయితే కనీసం మూడు పార్లమెంట్లు నియోజకవర్గాలకి గాను  మూడు పార్లమెంటరీ నియోజకవర్గాలకి గాను సుమారు ఒక వైద్య కళాశాలని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.


అయితే ఏకలవ్య స్కూల్స్ ని ఎస్టీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు...స్కూళ్లలో మౌలిక సదుపాయాలను పెంచేందుకు ప్రత్యేక పథకాన్ని మొదలుపెట్టనున్నారు...అంతేకాదు విద్య వ్యవస్థ కోసం  రైజ్ స్కీమ్ కింద సుమారు లక్ష కోట్లు ఖర్చు చేయనున్నారు...టీచర్స్ ఎప్పటికప్పుడు తమ ప్రతిభని పెంచుకునే విధంగా ఇంటిగ్రేటెడ్ బీఈడీ ప్రోగ్రామ్‌ను స్టార్ట్ చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: