స్టార్ హీరోయిన్ల అసలు పేర్లు ఏంటో తెలుసా..?

Divya

టాలీవుడ్ కోలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషలలో కూడా హీరోయిన్స్ పలు  సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటున్నారు.. అయితే అదృష్టం కలిసి రావడానికి చాలామంది హీరోయిన్లు సైతం పేర్లను మార్చుకున్న సందర్భాలు ఉన్నాయి. అలా ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్స్ కూడా పేర్లు మార్చుకున్న వారు ఉన్నారు వారి గురించి తెలుసుకుందాం.

1). నయనతార:
టాలీవుడ్ కోలీవుడ్ ప్రేక్షకులకు నయనతార పేరు బాగా సుపరిచితమే.. అయితే ఈమె అసలు పేరు డయానా మరియం కురియన్.. ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత ఈమె పేరును మార్చుకుంది.

2). రోజా:
గతంలో హీరోయిన్గా ఎన్నో చిత్రాలలో నటించిన రోజా... ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ పొలిటికల్ పరంగా బిజీగా ఉన్నది. రోజా అసలు పేరు శ్రీలత రెడ్డి.. రోజా పేరు మార్చుకున్న తర్వాత మంచి గుర్తింపు సంపాదించింది.
3) శ్రీదేవి:
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషలలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది శ్రీదేవి. ఈమె అసలు పేరు శ్రీ అమ్మ యంగర అయ్యప్ప .. ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత శ్రీదేవిగా గుర్తింపు సంపాదించుకుంది.
4). సన్నీ లియోన్:
బోల్డ్ బ్యూటీగా పేరుపొందిన సన్నీలియోన్ అసలు పేరు కరణ్జిత్ కౌర్..
5). నదియా:
గతంలో హీరోయిన్గా నటించి ఆ తర్వాత పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇమే అసలు పేరు జరీనా మొయిదు.

6). సిల్క్ స్మిత:
ఒకప్పుడు కుర్రకారులకు కలల రాణిగా పేరుపొందిన సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి.
7). నగ్మా:
ఇప్పటికి వివాహం చేసుకోకుండా సింగిల్గానే ఉన్నది. ఈమె అసలు పేరు నందిత అరవింద్ మొరార్జీ . తమిళ్ తెలుగు హిందీ ఇతర భాషలలో కూడా నటించింది.
8). అంజలి:
అచ్చ తెలుగు అమ్మాయిగా పేరుపొందిన ఈ ముద్దుగుమ్మ అసలు పేరు బాలాత్రిపుర్ సుందరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: