ఆరు అంశాలపై పట్టు...ఉద్యోగాలకు తొలి మెట్టు(పార్ట్-2)...!!
ఉద్యోఉగ నియామక పోటీపరీక్షల్లో కొందరు అభ్యర్థులు తగిన ప్రతిభ చూపలేక వెనుకబడుతుంటారు. దీనికి కారణం కీలకమైన కొన్ని సబ్జెక్టులపై వీరికి తగినంత పట్టు లేకపోవటమే! ఆ సబ్జెక్టులేమిటి? వాటిపై అవగాహన పెంచుకోవడానికి ఏ తీరులో కృషి చేయాలి?
1 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
ఇందులో ముఖ్యంగా మూడు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. అవి- న్యూమరికల్
ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, డేటా
అనాలిసిస్. బ్యాంకు పరీక్షల్లో న్యూమరికల్ ఎబిలిటీ, డేటా
అనాలిసిస్‌ల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. స్టాఫ్ సెలక్షన్ పరీక్షల్లో
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, గణితాల నుంచి
ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. పరీక్షను బట్టి (35-50) ప్రశ్నలు
వస్తాయి. డేటా అనాలిసిస్ కీలకాంశం.
ఏ పరీక్షలోనైనా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సెక్షన్‌లో ఎక్కువ మార్కులు
పొందితే మెరుగైన అవకాశం ఉంటుంది. సింప్లిఫికేషన్‌పై దృష్టిపెట్టి షార్ట్‌కట్స్, ఫార్ములాలపై
శ్రద్ధ చూపిస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చు. విషయపరిజ్ఞానంపై దృష్టిపెట్టి
వీలైనన్ని ఎక్కువ ప్రశ్రలు సాధన చేయడం మంచిది.
2 రీజనింగ్
దీనిలో మొత్తం 4 విభాగాలుంటాయి. వెర్బల్, నాన్‌వెర్బల్, ఎనలిటికల్, లాజికల్ రీజనింగ్. ప్రశ్నలో తర్కం పట్టుకుంటే రీజనింగ్ ప్రశ్నలకు సమాధానం సులువుగా పెట్టవచ్చు. ఆలోచనావిధానం పరీక్షించేలా ఈ ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నలో ఉన్న పూర్తి సమాచారాన్ని ఉపయోగించి వాస్తవికతకు దగ్గరగా ఉండేలా సమాధానాలు గుర్తించాలి. అనలిటికల్, వెర్బల్ రీజనింగ్ నుంచి ప్రతి పరీక్షలో ప్రశ్నలుంటాయి. నాన్‌వెర్బల్ రీజనింగ్ నుంచి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో మాత్రమే ప్రశ్నలు వస్తాయి. లాజికల్ రీజనింగ్ నుంచి తక్కువ ప్రశ్నలు వస్తున్నాయి.
అనలిటికల్‌లో క్రిటికల్ లేదా హైలెవల్ ప్రశ్నలుంటాయి. ఇవి చేయాలంటే ఇంగ్లిష్ భాషపై పట్టుండాలి. ఇందులో ప్రశ్నలు గ్రూప్‌గా వస్తాయి. ఒకే అంశం నుంచి 5 ప్రశ్నలు గ్రూప్‌గా ఉంటాయి. సీటింగ్ అరేంజ్‌మెంట్, ఇన్‌పుట్- అవుట్‌పుట్, ఇన్ఫరెన్సెస్, కన్‌క్లూజన్స్, డెసిషన్ మేకింగ్, బ్లడ్ రిలేషన్స్ ముఖ్యమైనవి. సరైన పద్ధతిలో సాధన చేస్తే అన్ని ప్రశ్నలకూ సరైన సమాధానం గుర్తించేలా ఉంటాయి. ఎక్కువ మార్కులు పొందడానికి వీలున్న విభాగం ఇది.
3 ఇంగ్లిష్
ఎక్కువమంది అభ్యర్థులు ఇబ్బంది పడేది ఈ సెక్షన్‌లోనే. వ్యాకరణం మీద పట్టుతోపాటు పఠన నైపుణ్యాలు (రీడింగ్ స్కిల్స్) ఉంటే ఈ విభాగంలో ఎక్కువ మార్కులు పొందవచ్చు. బ్యాంకు పరీక్షల్లోని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలంటే రీడింగ్ స్కిల్స్ ఉండాల్సిందే. మిగిలిన పరీక్షల్లోని ప్రశ్నలు ఎక్కువగా వ్యాకరణానికి సంబంధించి ఉంటాయి. ప్రశ్నను చదివిన వెంటనే సమాధానం గుర్తించగలిగేలా ఉంటాయి. ప్రతిరోజూ ఆంగ్ల దినపత్రిక చదివితే ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు.
రీడింగ్ కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సెంటెన్స్ అరేంజ్‌మెంట్, కరెక్షన్స్‌పై శ్రద్ధపెడితే మార్కులు అధికంగా వస్తాయి. యాంటనిమ్స్, సిననిమ్స్, ఆర్టికల్స్ ప్రశ్నలు ఎక్కువ సాధన చేసి ఏయే సందర్భాల్లో ఏ పదాలు వాడాలో గుర్తించాలి. ప్రతిరోజూ ఇంగ్లిష్ వార్తలు వినాలి. వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలు సాధన చేయటం, గత పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలను బట్టి నోట్స్ తయారు చేసుకుని సన్నద్ధమవటం చేస్తుండాలి. ఇలా కృషి కొనసాగిస్తే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చు.