అందుకే మళ్లీ కేసీఆర్ నీళ్ల నుంచి అగ్గిపుట్టిస్తున్నారా?
గత పాలనలో జరిగిన అవినీతి ఆరోపణలు బయటపడుతుండటం వల్ల పార్టీకి సవాలు ఎదురవుతోంది. కేసీఆర్ ఈ సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి నీటి వివాదాలను మళ్లీ లేపుతున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యూహం ద్వారా పార్టీ కార్యకర్తలను ఏకం చేసి రాజకీయంగా తిరిగి ఉధృతం కావాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజలు నీటి సమస్యలపై ఇప్పటికే అవగాహన పెంచుకున్నారని ఆయన సూచించారు.కేసీఆర్ ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా భారీ కమీషన్లు సంపాదించాలని కుట్ర చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును జూరాల నుంచి తీసుకునేలా రూపొందించారు. జూరాల నుంచి తీసుకుంటే లిఫ్టుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల కమీషన్లు తక్కువ వస్తాయని భావించి శ్రీశైలం బ్యాక్ వాటర్‌కు మార్చారని ఆయన వివరించారు. తల దగ్గర నుంచి నీరు తీసుకునే అవకాశాన్ని వదిలేసి తోక దగ్గర నుంచి తీసుకునేలా డిజైన్ చేశారని రేవంత్ విమర్శించారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కేవలం సున్నా ఇరవై అయిదు టీఎంసీలు మాత్రమే తీసుకునే దురవస్థలో తెలంగాణ ఉందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజుకు పదమూడు టీఎంసీలు తరలించేలా ప్రాజెక్టులను పూర్తి చేసుకుందని రేవంత్ పేర్కొన్నారు. ఈ మార్పు వల్ల తెలంగాణ రైతులు నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.కేసీఆర్ ఈ నీటి వివాదాలను మళ్లీ లేపడం ద్వారా తన పార్టీ కార్యకర్తలలో ఉత్సాహం నింపాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
9490520108.. వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు