హైదరాబాద్‌ను యూటీ చేస్తారా.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్?
2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో కేటీఆర్ ఇలాంటి ఆరోపణలు చేశారు. బీఆర్‌ఎస్ ఎంపీలు లేకపోతే కేంద్రం హైదరాబాద్‌ను యూనియన్ టెరిటరీగా మార్చే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ గడువు జూన్ 2, 2024తో ముగిసింది. ఆ తర్వాత కేంద్రం అటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
బీజేపీ నేతలు ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. అటువంటి ఆలోచనలు లేవని స్పష్టం చేశారు.కాంగ్రెస్ కార్యాలయంలో కూర్చొని బీఆర్‌ఎస్‌లో ఉన్నామని చెప్పడం బురదలో కూర్చొని పవిత్రంగా ఉన్నట్టు మాట్లాడడమేనని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో చేరినట్టు బహిరంగంగా చెప్పిన ఎమ్మెల్యేలపై స్పీకర్ ఆధారాలు లేవని విడ్డూరంగా తీర్పు ఇచ్చారని విమర్శించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు.
కండువాలు కప్పిన రేవంత్ రెడ్డి ఫిరాయింపు ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌కు చెందినవారని అంటున్నారని ఆరోపించారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. ఆధారాలు లేవని తీర్పు ఇవ్వడం రాజ్యాంగ హత్యకు సమానమని కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఇళ్లకు వెళ్లి ఎమ్మెల్యేలను ఫిరాయింపుకు ప్రోత్సహించారని ఆరోపించారు. ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఓడిపోతుందనే భయంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు.
9490520108.. వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు