కేటీఆర్, హరీశ్ రావు మధ్య రేవంత్ రెడ్డి పుల్లలు పెడుతున్నారా?
ముఖ్యంగా తనకు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మధ్య భేదాలు సృష్టించి బీఆర్ఎస్‌ను బలహీనపరచాలని చీప్ ట్రిక్స్ పన్నుతున్నారని హరీశ్ రావు ఆరోపించారు. ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రదర్శన సాధారణంగా ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ మద్దతు బలపడినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీలోని ఐక్యతను దెబ్బతీసేందుకు చేసినవని హరీశ్ రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, ఇది రేవంత్ రెడ్డిని రెచ్చగొడుతోందని ఆయన అన్నారు.
హరీశ్ రావు తన ప్రకటనలో కేసీఆర్ పట్ల తన నిబద్ధతను మరోసారి ధృవీకరించారు. ఎప్పటికీ తన గుండెల్లో కేసీఆర్ ఉంటారని, చేతిలో గులాబీ జెండా మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు, కుట్రలు ఎన్ని చేసినా ఫలించవని హెచ్చరించారు. తాను, కేటీఆర్ మరింత సమన్వయంతో పనిచేస్తూ రేవంత్ రెడ్డి పాలనలోని లోపాలను ఎండగడతామని ప్రకటించారు.
బీఆర్ఎస్‌లో కేటీఆర్, హరీశ్ రావు మధ్య గతంలో కొన్ని ఊహాగానాలు వచ్చినప్పటికీ ఇద్దరూ ఎప్పుడూ పార్టీ ఐక్యతను కాపాడుతూ వచ్చారు. ఫార్ములా ఈ రేస్ కేసు వంటి అంశాల్లో హరీశ్ రావు కేటీఆర్‌కు మద్దతుగా నిలిచారు. అదేవిధంగా కేటీఆర్ కూడా హరీశ్ రావుకు సంఘీభావం తెలిపారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్‌కు కొంత ఊరట నిచ్చిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీని బలోపేతం చేసేందుకు దోహదపడతాయని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.
9490520108.. వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు