ఆ 37 మంది ఎమ్మెల్యేలు జాగ్రత్త.. చంద్రబాబు వార్నింగ్?
చంద్రబాబు ఈ పరిణామాలను సమీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ నాయకత్వం ఈ దిశగా కొనసాగాలని ఆదేశించారు.అయితే మరో 37 మంది ఎమ్మెల్యేల పనితీరు ఇంకా మెరుగుపడాల్సి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. వీరి నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతున్నాయి. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు పరిష్కారం కావడం లేదు. ప్రతి ఎమ్మెల్యే పనితీరుపై నాలుగైదు వేర్వేరు మార్గాల్లో ఖచ్చితమైన సర్వేలు జరిపిస్తున్నట్టు చంద్రబాబు వెల్లడించారు. ఈ నివేదికల ఆధారంగా త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పార్టీలో పదవులు కంటే పనితీరే ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ విషయం సమావేశంలో ఉన్న నాయకుల్లో కలవరం రేకెత్తించింది. పార్టీ శ్రేణులు ఈ సందేశాన్ని సీరియస్గా తీసుకున్నాయి.
బీజేపీలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఏ పదవులు ఆశించకుండా నిస్వార్థంగా పనిచేస్తున్నారని చంద్రబాబు ఉదాహరణ ఇచ్చారు. అదే తరహాలో తెలుగుదేశం కార్యకర్తలు పార్టీ ఐడియాలజీకి అనుగుణంగా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పార్టీ క్యాడర్ను బలోపేతం చేయడం ప్రస్తుత ప్రాధాన్యత అని నొక్కి చెప్పారు. రాష్ట్రంలో పార్టీ బలాన్ని మరింత పెంచుకోవాలని ఆదేశించారు.విద్యారంగంలో వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టేందుకు స్కూల్ ఇన్నోవేటివ్ పార్టనర్షిప్ సమ్మిట్ పేరుతో కొత్త కార్యక్రమం ప్రారంభిస్తామని చంద్రబాబు ప్రకటించారు.
9490520108.. వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు