హైకమాండ్ వద్ద అమాంతం పెరిగిన రేవంత్ పరపతి.. ఇదిగో ఉదాహరణ?
పార్టీ అగ్రనేత నుంచి వచ్చిన ఈ సందేశం రేవంత్ రెడ్డి ఇమేజ్ ను మరింత బలోపేతం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.సోనియా గాంధీ లేఖలో రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. సమ్మిట్ నిర్వహణలో ఆయన చూపిన చొరవను ఆమె ఎంతో మెచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సోనియా గాంధీ చేసిన కృషి చిరకాలం గుర్తుండిపోతుందని రేవంత్ రెడ్డి ఎప్పుడూ స్మరించుకుంటారు. ఇప్పుడు ఆమె నుంచి వచ్చిన ఈ ప్రోత్సాహం రేవంత్ రెడ్డి రాజకీయ బలాన్ని పెంచుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
గ్లోబల్ సమ్మిట్ వంటి కార్యక్రమాలు రాష్ట్రాన్ని ప్రపంచ మ్యాప్ లో ప్రముఖ స్థానంలో నిలిపే అవకాశం ఉందని సోనియా ఆశాభావం వ్యక్తం చేశారు.రాష్ట్ర అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి చేస్తున్న కృషి విజయవంతం కావాలని సోనియా గాంధీ ఆకాంక్షించారు. ఈ మాటలు సీఎం రేవంత్ రెడ్డికి హైకమాండ్ పూర్తి మద్దతు ఉందనే సంకేతంగా కనిపిస్తున్నాయి. పార్టీలో రేవంత్ రెడ్డి స్థానం బలపడుతుందని ఈ సందేశం రుజువు చేస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతున్న నేపథ్యంలో ఈ ప్రోత్సాహం మరింత ఉత్సాహాన్ని నింపుతుందని నాయకులు అంచనా వేస్తున్నారు.సోనియా గాంధీ సందేశం రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో మైలురాయిగా నిలుస్తుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. హైకమాండ్ నుంచి వచ్చిన ఈ అభినందనలు రాష్ట్రంలో కాంగ్రెస్ పట్టు మరింత బలోపేతం అవుతుందని సూచిస్తున్నాయి.
9490520108.. వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు