
రేవంత్ రెడ్డీ.. సీఎంగా ఉండి ఇదేం భాషయ్యా?
కేసీఆర్ పేరు లేకుండా ఒక్క సమావేశం అయిన నిర్వహించారా... ఒక్క రోజైన ఉండగలరా .. తెలంగాణ చరిత్ర, గతిని మార్చిన కేసీఆర్ స్థానమే ప్రజల హృదయాల్లో పదిలంగా ఉంటుంది.. తెలంగాణను ఆవిష్కరించిన కేసీఆర్ గారిని బహిష్కరిస్తారా అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. అర చేతిని అడ్డుపెట్టి సూర్య కాంతిని ఎలా ఆపలేమో... కేసీఆర్ ను తెలంగాణ ప్రజల నుంచి దూరం చేయలేరన్నది గుర్తుంచుకోండి.. సామాజిక బహిష్కరణ చేయాల్సివస్తే అన్ని వర్గాల ప్రజలను అబద్దాల హామీలతో మోసం చేస్తున్న మిమ్మల్ని చేయాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని సొంత పార్టీ నేతల ద్వారా తెలుసుకొని, సహనం కోల్పోయి ఇలా మాట్లాడటం సబబు కాదన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. ప్రజాస్వామ్య పంథాలోనే, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి దిమ్మదిరిగే సమాధానం చెబుతారు.. మీ సర్వే సరైంది కాదని, మీ పార్టీ నాయకులే తూర్పార పడుతున్నారు... ముందు వారికి సమాధానం చెప్పండని సూచించారు.
సర్వేపై కాంగ్రెస్ పార్టీలోనే ఏకాభిప్రాయం లేనప్పుడు తెలంగాణ సమాజం ఎలా స్వాగతిస్తుందని ప్రశ్నించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. తెలంగాణ అంతటా ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయని తెలిసి భయపడి ఏవేవో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.