జగన్‌.. చంద్రబాబుకు అడ్డంగా దొరికిపోయాడా?

జగన్ మాకు అడ్డంగా దొరికిపోయాడు.. ఇదీ చంద్రబాబు తాజాగా చేసిన ఓ కామెంట్.. సెకీ అక్రమాల్లో జగన్ లడ్డూలా దొరికాడని.. తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. అమరావతి, పోలవరంతో పాటు అనేక వ్యవస్థలను జగన్ చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు గత ఆరు నెలలుగా శ్రమిస్తున్నామని చంద్రబాబు అంటున్నారు. జగన్ చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కోలుకునేలా చేయటంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు.

పలుమార్లు దిల్లీ పర్యటన ద్వారా కేంద్రంతో సమన్వయం చేసుకుని నిధులు తెచ్చుకోగలుగుతున్నామని.. ప్రజల ఆకాంక్షలు కూడా పెరిగాయని.. అన్ని రాత్రికి రాత్రే జరిగిపోవాలి అంటే సాధ్యం కాదు అనేది అందరూ గమనించాలని చంద్రబాబు సూచించారు. ఆర్థిక పరిస్థితిని గాడిని పెట్టి అందరి సమస్యలూ పరీష్కరించాల్సిన బాధ్యత నాపై ఉందన్న చంద్రబాబు.. తల్లి కి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ కార్యక్రమాలు అన్నీ అమలు చేసితీరుతామన్నారు.

ఎమ్మెల్యేలకు దశల వారీగా కౌన్సెలింగ్ చేస్తున్నాను.. సామాజిక బాధ్యతను ఎమ్మెల్యేలకు గుర్తు చేస్తూ, వారు ప్రజలకు జవాబుదారీలా ఉండేలా కంట్రోల్ చేస్తున్నానని చంద్రబాబు అంటున్నారు. ఎవ్వరూ తప్పుడు పనులు చేయొద్దని ఎమ్మెల్యేలకు పదే పదే హెచ్చరిస్తున్నానంటున్న చంద్రబాబు.. సామాజిక మాధ్యమాల్లో ఎవ్వరూ తప్పుడు పోస్టులు పెట్టకుండా చాలావరకూ నియంత్రించగలిగామన్నారు. ఇంకా సమీక్షించుకుని ప్రజలకు ఏది మేలో అదే చేస్తామని చంద్రబాబు తెలిపారు.

కొన్ని అంశాల్లో శ్రేణుల అభిప్రాయాలు, నా అభిప్రాయాలకు తేడా ఉంటోందన్న చంద్రబాబు.. సమాజానికి హానికరమైన వారిని మాత్రం వదిలేది లేదన్నారు. 1995లో ఫ్యాక్షనిజం, రౌడీయిజం, మతకలహాలను అణచివేసినట్లే ఇప్పుడూ పనిచేస్తానని చంద్రబాబు తెలిపారు. కొందరు కార్యకర్తలు తమ సొంత అజెండా నేను అమలు చేయాలనుకుంటున్నారని.. జగన్ లాగా మేము తప్పులు చేస్తే ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారని.. నాకు నా ప్రజలే హై కమాండ్ అని చంద్రబాబు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: