ప్లాన్ బీకి రెఢీ అయిన చంద్రబాబు..? పవన్ కి వెన్నుపోటు పొడుస్తున్నారా..?

రాజకీయాల్లో మిత్రృత్వాలు శతృత్వాలు ఎపుడు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు.  అర్ధ శతాబ్దం రాజకీయ జీవితాని ఔపాసన పట్టేసిన చంద్రబాబు లాంటి రాజకీయ దురంధరుడికి అయితే ఇలాంటివి అన్నీ బాగా తెలుసు.  ఆయన ఎపుడూ చాలా దూరదృష్టితో ఆలోచిస్తారు.  ఆయన ఈ రోజు బాగా ఉన్నామని రిలాక్స్ కారు.  ఆయన రేపటి గురించి ఆలోచన చేస్తారు. అనుకూలమైన పరిస్థితుల్లో కూడా ప్రతికూలతను గురించి ముందే ఆలోచించి తగిన జాగ్రత్తలు తీసుకుంటారు అని చెబుతారు.


పవన్ కళ్యాణ్ టీడీపీతో కూడడం వల్ల బలమైన సామాజిక వర్గం వెన్ను దన్నుగా ఉంది. కూటమికి అది కాపు కాసింది. ఆ విధంగా 2024 ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాను టీడీపీ కూటమి సొంతం చేసుకుంది అయితే ఈ రోజు ఉన్న పరిస్థితి మారవచ్చు అన్నది కూడా బాగా ఎరిగిన చంద్రబాబు ప్లాన్ బీలో కూడా ఉన్నారని అంటున్నారు.  ఏపీలో కాపు సామాజిక వర్గం మద్దతు ఎక్కువగా జనసేనకు ఉంది.  


దాంతో టీడీపీ ఆ సామాజికవర్గంలో తమ మద్దతుని మరింతగా పెంచుకోవడానికి భారీ స్కెచ్ ని గీసింది అని అంటున్నారు. వైసీపీని టార్గెట్ చేసి బలంగా ఉన్న కాపు నేతలను వరసబెట్టి చేర్చుకునేందుకు టీడీపీ రెడీ అయింది అని అంటున్నారు.  మాజీ మంత్రులు ఆళ్ళ నాని, అవంతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్లు తమ నియోజకవర్గాలలో బలంగా ఉన్నారు.  అంగబలం అర్ధ బలం గట్టిగా ఉన్న వారు.  పరిస్థితులు మారితే తమ బలంతో పాటు పార్టీ బలం తోడు చేసుకుని గెలుపు గుర్రాలు ఎక్కేవారే అని అంటున్నారు. దాంతో వీరి మీద కన్నేసి మరీ టీడీపీ వైసీపీకి దూరం చేసిందని తొందరలోనే వీరిని చేర్చుకుంటోందని అంటున్నారు.  


రానున్న రోజులలో ఉత్తరాంధ్ర సహా గోదావరి జిల్లాలలో బలంగా ఉన్న కాపు నేతలను ఆపరేషన్ ఆకర్ష్ పేరిట చేర్చుకోవాలని టీడీపీ చూస్తోంది అని అంటున్నారు. తద్వారా బలమైన సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకుంటారు అని అంటున్నారు.  రేపటి రోజున రాజకీయ పరిణామాలు ఎటు నుంచి ఎటు తిరిగినా టీడీపీ సేఫ్ జోన్ లో ఉండేలాగానే ఈ చేరికలు ఉంటాయని అంటున్నారు. మొత్తానికి జనసేన మీద ఆధారపడకుండా బలమైన సామాజిక వర్గంలో తన మద్దతుని మరింతగా పెంచుకుంటే టీడీపీకి తిరుగు ఉండదన్న భావనలో ఉన్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: