షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పుంజుకుంటుందా? వెనక్కి వెళ్తుందా?

ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిల చేపట్టి పది నెలలు అవుతోంది.  ఈ పది నెలల్లో ఏపీలో బాగుపడిందా ఏమైనా పుంజుకుందా అన్న చర్చ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీని ఒడ్డున పడేయడానికి పెద్దలు ఎంచుకున్న ఒక మార్గం షర్మిల చేతిలో పగ్గాలు పెట్టడం.  పీసీసీ చీఫ్ గా షర్మిలను చేయడం ద్వారా పోయిన చోట నుంచే ఓట్లను దక్కించుకోవడం అన్నది వారి ఆలోచన.  వైసీపీని వీక్ చేస్తూ కాంగ్రెస్ ని బలోపేతం చేయడం అన్నది ఒక బిగ్ టాస్క్.


షర్మిల సాధారణ ఎన్నికల్లో పెద్దగా కాంగ్రెస్ బండిని ముందుకు తీసుకుని వెళ్లలేకపోయారు.  వైసీపీ వద్దనుకున్న వారు అంతా టీడీపీలోకే చేరిపోయారు. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వంటి వారి వద్దకు షర్మిల వెళ్ళినా ఫలితం లేకపోయింది.  మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారితో భేటీలు వేసినా ఏమీ జరగలేదు. చిన్నా చితకా నేతలు కూడా కాంగ్రెస్ లో చేరారు. అయితే ఎంత చేసినా కాంగ్రెస్ ఏపీలో తన ఓటు షేర్ ని పెంచుకోలేకపోయింది.


షర్మిల కడప ఎంపీ సీటుకు పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు.  తన అన్న మీద విమర్శలు చేయడం బాబాయ్ వివేకా హత్య కేసుని జనం ముందు పెట్టడం వంటివి చేశారు. అయినా అది పెద్దగా పండినట్లుగా లేదు. మొత్తానికి వైసీపీ అధికారంలోకి దిగిపోయింది. దాని వల్ల కొంత సంతోషించి ఉండవచ్చు కానీ ఏపీలో గత ఆరేడు నెలలుగా చూస్తే కాంగ్రెస్ అయితే ఏ మాత్రం ఎత్తిగిల్లలేదు.


ఈ రోజుకీ వైసీపీ గిట్టదు అనుకున్న వారు నేరుగా కూటమి తలుపులు కొడుతున్నారు. దాంతో కాంగ్రెస్ కి పెద్దగా కలిసిరావడంలేదు.  ఇక షర్మిల అయితే జనంలోకి వచ్చి ఏ విమర్శ చేసినా జగన్ మీదనే విరుచుకు పడుతున్నారు.  అందులోనే తన రాజకీయాన్ని చూసుకుంటూ తృప్తి పడుతున్నారు. అంతే తప్ప కాంగ్రెస్ ని బలోపేతం చేసే చర్యలను ఆమె చేపట్టడం లేదు అన్నది అయితే ఉంది.


మొదట్లో కాంగ్రెస్ సీనియర్లు కొందరు షర్మిల వెంట నడచారు. ఇపుడు  ఎవరూ సీన్ లోకి రావడం లేదు. రఘువీరారెడ్డి, సాకే శైలజానాధ్ వంటి వారు కూడా యాక్టివ్ గా ఉండలేకపోతున్నారు.  షర్మిల తన తీరుని మార్చుకుని టీడీపీ కూటమి మీద రాజకీయ సమరం ప్రకటించాల్సి ఉందని అంటున్నారు. లేకపోతే ఏపీలో మళ్లీ కాంగ్రెస్ కి భంగపాటు తప్పదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: