అల్లు అర్జున్ అరెస్ట్..కేసీఆర్ తో టచ్ లోకి అల్లు ఫ్యామిలీ ?
అందులో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసిన వెంటనే అల్లు అర్జున్ రేవతి కుటుంబ సభ్యులకు రూ. 25 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అంతేకాకుండా తన కుమారుడు శ్రీ తేజ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా అతడికి కావలసిన వైద్య సదుపాయాన్ని అల్లు అర్జున్ చేపిస్తున్నాడు. కాగా, రేవతి మరణం మీద అల్లు అర్జున్ పైన కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే.
ఈ కేసు మీద అల్లు అర్జున్ ఒకరోజు జైలు జీవితం గడిపి బెయిల్ మీద బయటకు వచ్చారు. ప్రస్తుతం అల్లు అర్జున్ బయటికి ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నారు. అయితే అల్లు అర్జున్ బెయిల్ విషయం మీద తెలంగాణ పోలీసులు సుప్రీంకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని పోలీసులు అంటున్నారు. సుప్రీంకోర్టు ఈ బెయిల్ రద్దుచేసి అల్లు అర్జున్ ను మళ్లీ జైలుకి పంపిస్తారా లేదా అనే సందేహం ప్రతి ఒక్కరిలో ఉంది.
అయితే ఈ విషయం మీద రేవంత్ రెడ్డి కుట్ర ఉందని అంటున్నారు. రేవంత్ రెడ్డి పెట్టే కేసులపైన ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై కేసీఆర్ ను కలవాలని అల్లు అరవింద్ కుటుంబసభ్యులు అనుకుంటున్నారట. ఈ కేసు నుంచి ఎలా బయటపడాలి అనే విషయం గురించి కెసిఆర్ దగ్గరికి వెళ్లి చర్చించాలని ప్లాన్ లో ఉన్నారట. బన్నీ మామయ్య గతంలో బీఆర్ఎస్ పార్టీలో పని చేశారు. ఆయన ద్వారానే కేసీఆర్ దగ్గరకు వెళుతున్నారట. మరి అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు కేసీఆర్ వద్దకు వెళ్లి మాట్లాడిన అనంతరం ఈ విషయంపైన కేసీఆర్ ఎలాంటి సలహాలు ఇస్తారు ఇస్తారో చూడాలి.