సెంటిమెంట్ తో బీఆర్ఎస్ కి చెక్ పెడుతున్న రేవంత్ రెడ్డి..?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి రాజకీయాలు హాట్‌హాట్‌గానే నడుస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రతిపక్ష పోషిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది.  కాంగ్రెస్ ప్రభుత్వం ఓ కొత్త పనికి శ్రీకారం చుట్టిన అడ్డుపడుతోంది. ప్రతిదాంట్లోనూ తప్పులే వెతుకుతోంది.  ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతను తీసుకురావాలని ముందుకు సాగుతోంది.  


బీఆర్ఎస్ ఆగడాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెక్ పెట్టే ప్లాన్ చేశారు.  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక మూసీ ప్రక్షాళన చేపట్టాలని భావించింది. మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించింది. దాంతో కొందరు రోడ్డెక్కి ఆందోళనబాట పట్టారు. బీఆర్ఎస్ నేతలను సైతం కలిశారు. దీనిని అవకాశంగా తీసుకున్న గులాబీ నేతలు అప్పటి నుంచి మూసీ మీద నానా రకాలుగా మాట్లాడుతూనే ఉన్నారు.  కేటీఆర్ కు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు.


అందులో భాగంగా నల్గొండ సెంటిమెంటును పండించేందుకు సిద్ధమైంది. సెంటిమెంటుతోనే బీఆర్ఎస్‌కు చెక్ పెట్టాలని చూస్తోంది. మూసీని వ్యతిరేకిస్తే అది నల్గొండ ప్రజలను వ్యతిరేకించినట్లేనని ప్రచారం చేసేందుకు సిద్ధమైంది. రేవంత్ రెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా మూసీ వెంట పాదయాత్ర చేయబోతున్నారు.  మూసీ వల్ల అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకోనున్నారు.  అదే క్రమంలో ఆయన బీఆర్ఎస్ వైఖరిని సైతం వారికి వివరించే ప్రయత్నం చేసేందుకు రెడీ అయ్యారు. వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి నల్గొండను ఎంచుకున్నారన్న ప్రచారమూ జరుగుతోంది.  


మూసీ ప్రక్షాళలను అడ్డుకుంటే నల్గొండ ప్రజలు ఊరుకోబోరని కాంగ్రెస్ హెచ్చరిస్తూ వస్తున్నది. హైదరాబాద్‌లో కలిసే మురికి, డ్రైనేజీ అంతా నల్గొండకే వస్తుండడతో.. దాని వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే.  కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ ప్రచారంతో బీఆర్ఎస్ ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడినట్లుగా తెలుస్తోంది.  అందుకే రూట్ మార్చి మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదని, మూసీ పేరిట జరిగే దోపిడీకి వ్యతిరేకమని తన స్టాండ్‌ను మార్చుకుంది.  బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు కాంగ్రెస్ మరోవిధంగా కౌంటర్ ఇస్తోంది. అసలు ప్రాజెక్టు టెండర్లు కాకుండానే.. పనులు ప్రారంభం కాకుండానే దోపిడీ ఎక్కడి నుంచి మొదలైందని నిలదీస్తున్నారు. సెంటిమెంటుతోనే బీఆర్ఎస్‌ను దెబ్బకొట్టాలని చూస్తుండడం రేవంత్ తెలివిని అందరూ మెచ్చుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: