నేటితో హమాస్ దాడికి ఏడాది!.. ఈ రోజు ఏం జరగబోతుందో?
సరిగ్గా ఏడాది క్రితం అక్టోబరు 7న ఇజ్రాయెల్ పై పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ దాడికి పాల్పడింది. ఈ సారి అక్టోబరు 7న ఏం జరగబోతుంది? గత మంగళవారం తమ దేశంపై మిసైళ్లతో దాడి చేసిన ఇరాన్ పై ప్రతీకారం తీర్చుకుబోతుందా? అనే అంశంపై ఇప్పుడు అంతటీ వాడి వేడీ చర్చ జరుగుతోంది.
ఈ తరుణంలో ఆదివారం పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఉత్తర గాజా ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ పైకి హమాస్ మిలిటెంట్లు పెద్ద సంఖ్యలో రాకెట్లను సంధించారు. అయితే ఇజ్రాయెల్ గగన తల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ వాటిని గాల్లోనే అడ్డుకొని కూల్చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలే ఖమేనీ ఎక్స్ వేదికగా పలు ట్వీట్లు చేశారు. ఇజ్రాయెల్ తో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నించే ముస్లిం దేశాలను తాము వదలబోమని ఆయన స్పష్టం చేశారు.
అఫ్గానిస్తాన్ నుంచి యెమెన్ దాకా, ఇరాన్ నుంచి లెబనాన్ దాకా ఇస్లామిక్ దేశాల స్వాంతత్ర్యాన్ని పరిరక్షించేందుకు తమ వంతు సాయాన్ని తప్పక అందిస్తామని ఖమేనీ వెల్లడించారు. పాలస్తీనా, లెబనాన్, ఇరాక్, సిరియా, యెమెన్ ప్రజల శత్రువులే ఇరాన్ శత్రువులని ఆయన తెలిపారు.
ఇజ్రాయెల్ మిస్సైల్ డాడులను గత మంగళవారం విజయవంతంగా పూర్తి చేసినందకు గానూ ఇరాన్ రెవెల్యూషనరీ గార్స్డ్ ఏరో స్పేస్ కమాండర్ 62 ఏళ్ల అమీర్ అలీ హజీజాదేను ఆర్డర్ ఆఫ్ ఫథ్ తో సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ సత్కరించారు. 2009 నుంచి సంవత్సరం నుంచి ఇరాన్ వాయుసేనను అమీర్ అలీ హజీజాదే లీడ్ చేస్తున్నారు.
ఇజ్రాయెల్ ఏ క్షణమైనా ప్రతీకార దాడికి దొగొచ్చనే అంచనాల నేపథ్యంలో ఇరాన్ హై అలర్ట్ మోడ్ పై ఉంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు విమాన సర్వీసులు నడవవని స్పష్టం చేసింది.