మీకేం పోయేకాలంరా.! ఇలా చేస్తున్నారు ఏంటి? దేశంలో అల్లకల్లోలం జరగబోతుందా?

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కాన్పూర్ ప్రాంతంలో రైల్వే పట్టాలపై గ్యాస్ సిలిండర్ అమర్చారు. దీనిని దిల్లీ హౌరా రైలుపై రైల్వే స్టేషన్ పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన ప్రేమ్ పూర్ రైల్వే స్టేషన్ కు సమీపంలో చోటు చేసుకుంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పట్టాలపై గ్యాస్ సిలిండర్ గుర్తించే సమయంలో లూప్ లైన్ మార్గంలో కాన్పూర్ ప్రాంతం నుంచి ప్రయాగ్ రాజ్ కు గూడ్స్ రైలు ప్రయాణిస్తోంది.


ఒక ఎక్స్ ప్రెస్ రైలుకు మార్గం సుముగం చేసేందుకు ఆ రైలును ఆపారు. ఆ సమయంలో లోకో ఫైలెట్ సిలిండర్ ను గుర్తించారు. వెంటనే అధికారులకు సమాచారం అందించాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇది మాత్రమే కాదు.. ఇటీవల ఈ తరహా సంఘటనలు పెరిగిపోతున్నాయి. దీనిపై సాక్షాత్తూ అమిత్‌ షా ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో అల్లకల్లోలం సృష్టించేందుకు  విద్రోహ శక్తులు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.


వారి ఆటలు ఇక సాగవని.. హెచ్చరించారు. ఆయన అలాంటి హెచ్చరికలు జారీ చేసినా కాన్పూర్ ప్రాంతంలో సిలిండర్ రైలు పట్టాలపై పడి ఉండటం విశేషం. ప్రయాగ్ రాజ్ నుంచి భివాని ప్రాంతానికి ఎక్స్ ప్రెస్ వెళ్తోంది. కాన్పూర్ సమీపంలో పట్టాలపై ఉన్న గ్యాస్ సిలిండర్ ను ఢీకొట్టింది. ట్రాక్ పై అనుమానాస్పద వస్తువు ఉన్నట్లు లోకో ఫైలెట్ గుర్తించి అత్యవసర బ్రేకులు వేశాడు. అప్పటికీ ఆ రైలు సిలిండర్ ను ఢీ కొట్టింది. ఫలితంగా అది కొంత దూరంలో పడింది. రైలుటు ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదు.


అయితే ఆ పట్టాలకు సమీపంలో ధ్వంసమైన సిలిండర్, పెట్రోల్ నిండిన ప్లాస్టిక్ బాటిల్, అగ్గి పెట్టె నాలుగు గ్రాముల పేలుడు పదార్థాలు లభించాయి. ఇక అజ్మీర్ సమీపంలోని పట్టాలపై సిమెంట్ బ్లాక్స్ ఉండటాన్ని అధికారులు గుర్తించి అప్రమత్తం చేయడంతో ప్రమాదం తప్పింది.


రైళ్లను ప్రమాదాలకు గురి చేసేందుకు విద్రోహ శక్తులు ఇటువంటి కుట్రలకు పాల్పడుతున్నారు. గత నెల నుంచి ఇప్పటి వరకు ఈ తరహా ఘటనలు 18 వరకు జరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: