చంద్రబాబు చాణక్యం.. జగన్ ని గురి చూసి కొట్టారుగా?
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారు చేయడానికి ఆవు నెయ్యి ఉపయోగిస్తారు. ఈ ఆవు నెయ్యిని ఏఆర్ అనే కంపెనీ సరఫరా చేస్తోంది. గత జులైలో ఈ కంపెనీ సరఫరా చేసిన నెయ్యి ట్యాంకర్ లో కల్తీ జరిగింది అని నివేదిక ద్వారా తెలిసింది. దీంతో ఈ విషయం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఫలితంఆ శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని వార్తలు బయటకు రావడం మొదలయ్యాయి.
వాస్తవానికి ఇలాంటి విషయాలు టీటీడీ ఈవోలు చెబుతారు. అయితే ఒక అధికారి గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పలేడు. అందులో ఉన్న విషయాలను స్పష్టంగా చెప్పలేడు. ఈ నేపథ్యంలో ఆ బాధ్యతలను చంద్రబాబు తీసుకున్నారు. శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని.. దీనంతటికీ జగన్ ప్రభుత్వ హయాంలో జఏఆర్ అనే కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందమే కారణం అని ఏపీ సీఎం స్పష్టం చేశారు.
అంతే ఏపీలో రాజకీయ మంటలు చెలరేగాయి. అంతకుముందు ఈ నివేదికలో ఉన్న విషయాలను టీటీడీ ఈవో కు బదులుగా టీడీపీ నేత ఆనం వెంకట రమణా రెడ్డి మీడియా ముందుకు వచ్చి వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా జగన్ ఇరుకున పడాల్సి వచ్చింది. వాస్తవానికి ఆ నివేదికలో వెజిటబుల్ ఫ్యాట్ అంటనే వనస్పతి ఉందని ఈవో చెప్పగా.. అందులో జంతువుల కొవ్వు ఉందని చంద్రబాబు ఆరోపించడం దుమారం రేగింది.
పైగా జగన్ క్రైస్తవుడు కావడంతో తిరుమలకు సంబంధించిన విషయాలను పెద్దగా పట్టించుకోలేదు అనే ఆరోపణలను టీడీపీ నేతలు చేస్తున్నారు. అన్యమత ప్రచారం, తిరుమలలో ఫొటో షూట్, ఆలయ ప్రధాన గోపురంపై డ్రోన్ చక్కర్లు కొట్టడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు నెయ్యి కల్తీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వీటన్నింటిని చంద్రబాబు తన అనుకూల మీడియా ద్వారా జగన్ పై వ్యతిరేకత పెంచే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో జగన్ ప్రతి దానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదే క్రమంలో చంద్రబాబు తన చాణక్యానికి మరింత పదును పెడుతున్నారు. జగన్ ను మరింత ఇరుకున పెట్టుందుకు యత్నిస్తునారు.