రేవంత్ ని ఆటాడుకుంటున్న కేటీఆర్! ఇలా ర్యాగింగ్ చేస్తున్నారేంటి?

నోట్లో నుంచి వచ్చే ప్రతి మాటను పట్టుకొని లాగి పీకి క్లాస్ ఇస్తున్నారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నోటి నుంచి వచ్చే ప్రతి మాటకు కౌంటర్ ఇస్తున్నారు. రేవంత్ మీద ట్వీట్ల యుద్ధం ప్రకటిస్తున్నారు. ఇది అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ విషయాన్ని గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి ట్విటర్ టిల్లు అని కేటీఆర్ కు వ్యంగ్యంగా నామకరణం చేశారు.


దీనికి కౌంటర్ గా సీఎం రేవంత్ ని ఉద్దేశిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు కేటీఆర్. సెక్రటేరియట్ వద్ద రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. ప్రారభించిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి కేటీఆర్ అండ్ కో ఘాటుగా రియాక్ట్ అయ్యారు. సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేలా తాజాగా ట్వీట్ చేసిన కేటీఆర్.. సీఎం రేవంత్ ను చిట్టి నాయుడిగా పేర్కొన్న వైనం సంచలనంగా మారింది.


చిట్టి నాయుడు సుభాషితాలు అంటూ.. కేటీఆర్ చేసిన ట్వీట్ లో పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే.. రాజీవ్ గాంధీ కంప్యూటర్ డివైజ్ కనిపెట్టాడు అంటూ రేవంత్ మాట్లాడారని.. కానీ కంప్యూటర్ కనిపెట్టింది రాజీవ్ గాంధీ కాదు.. ఛార్లెస్ బాబేజీ అంటూ కేటీఆర్ కౌంటర్ వేశారు. ఐదే విధంగా రాజీవ్ గాంధీ కంప్యూటర్ దేశానికి పరిచయం చేశారు అన్న సీఎం వ్యాఖ్యలకు కౌంటర్ గా టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఆటోమేటిక్ క్యాలిక్యులేటర్ వారు 1956 లో ఇండియాలో తొలిసారి కంప్యూటర్ సేవలు ప్రారంభించారని అప్పటికి రాజీవ్ గాంధీకి పన్నెండేళ్లు అని చెప్పారు.


చివర్లో ఏదో నొటికొచ్చింది వాగడం.. ఆ తర్వాత దొరికిపోవడం ఎందుకు? నీకు తెలిసిన రియల్ ఎస్టేట్ దందాలు.. బ్లాక్ మొయిలింగ్ వీటికి పరిమితం అయితే మంచిదమ్మా చిట్టి.. అంటూ దట్టించిన ఎటకారపు ట్వీట్ ను రేవంత్ పైకి వదిలారు కేటీఆర్. కొందరు రేవంత్ మాటల్లోని తప్పులను భలే పట్టుకున్నారు అని అభినందిస్తుంటే. మరికొందరు మరీ ఇంత రంధ్రాన్వేషన ఎందుకు అని పెదవి విరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: