మోదీకి షాక్? ఎన్డీయే నుంచి బయటకు చంద్రబాబు?

కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి రెండు ఊత కర్రలుగా అటు టీడీపీ, ఇటు జేడీయూలు ఉన్నాయి. ఈ రెండు పక్షాల్లో బలమైన ఊత కర్రగా టీడీపీ ఉంది. టీడీపీ మీదనే బీజేపీ పెద్దలు నమ్మకం పెట్టుకున్నారు. చంద్రబాబుకి ఉన్న ఏపీ అవసరాలను తీర్చడంతో ఆయన్ను మచ్చిక చేసుకొని అయిదేళ్లు బండిని నడపాలని కూడా ఆలోచన చేస్తున్నారు.


అయితే కొన్ని పాలసీల విషయంలో మాత్రం బీజేపీ పెద్దలు ససేమేరా అంటున్నారు. అది ఈ రోజుకీ కొనసాగుతోంది. అందులో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉక్కు కూడా ఒకటి. ఇది పాలసీ డెసిషన్ అని బీజేపీ పెద్దలు అంటున్నారు. ఒక్క స్టీల్ ప్లాంట్ విషయంలో మినహాయింపు ఇస్తే మిగిలిన లిస్ట్ లో ను పబ్లిక్ సెక్టార్ల పరిశ్రమలన్నీ రిలాక్షేషన్ కోరుతాయని అప్పుడు పాలసీయే ఉండదని బీజేపీ పెద్దలు చెబుతున్నారు.


ఇక బీజేపీ విధానాలు ఎలా ఉన్నాయి అన్నది ఆ పార్టీ నేతలే తరచూ చెబుతూ ఉంటారు. ప్రభుత్వం వ్యాపారం చేయకూడదు అన్నది వారి ఫిలాసఫీ. అలా లాభ నష్టాలను చూడకుండా ప్రభుత్వం ముందుకు సాగాలన్నది ప్రజా సంక్షేమమే విధానం కావాలన్నది ఆ పార్టీ ఆలోచన.


ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి, టీడీపీకి మధ్య ఏమైనా విభేదాలు వస్తే ఇక్కడే రావొచ్చు అని అంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం అయితే ప్రైవేటీకరణకు కట్టుబడి ఉంది. కాకపోతే ఏమైనా సవరణలపై మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ విషయమై టీడీపీ తేల్చుకోవాల్సి ఉంది. మరి మెత్తగా చెబితే వింటారా అంటే కాదు అని తేలిపోతుంది. మరి ఎంతదాకా వెళ్లాలి అంటే మద్దతు ఉపసంహరణ దాకా వెళ్లాల్సిందే అని అంటున్నారు విశ్లేషకులు. ఈ విషయంలో ఎగదోస్తుంది వైసీపీయేనని చెప్పాలి.


వైసీపీ నేత బొత్స సత్యానారాయణ బీజేపీకి మద్దతు ఇస్తున్న టీడీపీ ఎందుకు విశాఖ ప్రైవేటీకరణ రద్దు విషయాన్ని అడగటం లేదని ప్రశ్నించారు. టీడీపీ అధినాయకత్వం ఏం ఆలోచిస్తుందో తెలియదు కానీ.. అందాక వెళ్తే తప్ప స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు అని వైసీపీ అంటోంది. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: