స్ర్టాటజీ మార్చిన జగన్! టీడీపికి ఇక చుక్కలే?
ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. 175 స్థానాలకు 11 సీట్లకే పరిమితం అయింది. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ప్రజలు దారుణంగా తిరస్కరించారు. దీంతో వైసీపీ పని అయిపోయిందని అంతా భావించారు. ఇక ప్రజలు గుర్తించరని అంచనా వేశారు. ఇదే సమయంలో పార్టీకి భవిష్యత్తు లేదని భావిస్తున్న నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు.
కూటమి పార్టీల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే జగన్ చర్యలతో వారంతా పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. వారి నిర్ణయాలను వాయిదా వేసుకుంటున్నారు. కొద్ది రోజులు చూసి ఆగి అడుగులు వేద్దాం అనే ఉద్దేశంతో వారంతా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే రాజకీయ వలసలు ఆగాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓటమి ఎదరైన వెంటనే జగన్ నైరాశ్యంలో కూరుకుపోయారు. తొలిసారిగా విలేకరుల సమావేశం నిర్వహించి చాలా బాధతో మాట్లాడుతూ కనిపించారు. ప్రజలకు ఎంతో చేసినా ఎందుకు తిరస్కరించారో అర్థం కావడం లేదని వాపోయారు.
ఎమ్మెల్యేప్రమాణ స్వీకారంలోని దీలాగా కనిపించారు. శాసన సభ సమావేశాలకు ముఖం చాటేశారు. దీంతో పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపించింది. ఇక జగన్ ప్రజల్లోకి వస్తారా అనే సందేహాలు అందరిలో మొదలు అయ్యాయి. పార్టీ ఓటమి పాలు కాగానే జగన్ ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవించిన వారంతా పార్టీని మారడం ప్రారంభించారు. సరిగ్గా ఇటువంటి సమయంలో జగన్ తన స్ర్టాటజీని మార్చారు. వివిధ కేసుల్లో చిక్కుకున్న బాధితులను పరామర్శిస్తున్నారు.
ఈ క్రమంలో ఎక్కడకి వెళ్లినా జనం క్రేజ్ తగ్గడం లేదు. ఆ రెస్పాన్స్ కి పార్టీ సైతం ఆశ్చర్యానికి గురైతోంది. పార్టీకి పూర్వ వైభవం ఖాయమని చాలా మంది బలంగా నమ్ముతున్నారు. అటు జనాలను చూసి పార్టీని వీడుతామనుకున్న నేతలు ఆలోచనలో పడ్డారు. ఇదే దూకుడు కొనసాగించాలని జగన్ సైతం డిసైడ్ అయ్యారు. ప్రభుత్వ ప్రజా వైఫల్యాలను ఎండగట్టి ప్రజలకు దగ్గర కావాలని చూస్తున్నారు. మొత్తానికి జగన్ తన స్ట్రాటజీ మార్చి ప్రజల ముందుకు వస్తున్నారు. మరి టీడీపీ ఎలా తట్టుకుంటుందో చూడాలి.