అమెరికాలో మనోళ్లు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో?

అమెరికాలో పుట్టిన పిల్లలకు జన్మతః ఆ దేశ పౌరసత్వం లభిస్తుంది. ఇండియాలో పుట్టి, తల్లిదండ్రులతో పాటు అమెరికా కు వెళ్లిన పిల్లలు. వీరు డిపెండింగ్ వీసాతో వెళ్లి ఉంటారు. వీరిని డాక్యూమెంటెడ్ డ్రీమర్స్ అంటారు. 21 ఏళ్లు దాటిఇతే డిపెండింగ్ స్టేటస్ తొలిగిపోతుంది. ఇప్పుడు అలాంటి వారు రెండు లక్షల యాభై వేల మంది అమెరికలో ఉన్నారు.

వీరందరనీ తిరిగి పంపిస్తారా ? అమెరికా వెళ్లిన నాటికి ఎక్కువ మంది చిన్న పిల్లలు. అక్కడే చదివి, పెరిగి పెద్దవారు అయ్యారు. ఇప్పుడు ఇండియాకొచ్చి స్థిరపడలేరు. ఇక్కడికి రావాలని కూడా వారికి ఉండదు. మరి వారి భవిష్యత్తు ఏంటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. తిరిగి గ్రీన్ కార్డు కి దరఖాస్తు చేసుకోవడం లేదా డిపోర్టేషన్. గతంలో రిపబ్లికన్ పార్టీ ఈ సమస్యకు చెందిన బిల్లును వ్యతిరేకించింది. ఇప్పుడు ట్రంప్ గెలిస్తే.. వీరి పరిస్థితి ఏంటి. ఒకవేళ కమలా హారిస్ గెలిచినా గ్రీన్ కార్డు ఇస్తుందన్న గ్యారంటీ లేదు.

వీరి సంగతి అలా ఉంచితే… నేడు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయుల పరిస్థితి గందరగోళంగా మారింది. అమెరికా వెళ్లిపోతే ఎలాగోలా ఒకలా హ్యాపీలా బతికేయొచ్చు. ఇది మనవారి ఆలోచన. నిన్నటి దాకా ఇది నిజమే కావొచ్చు. కానీ నేడు పరిస్థితి తలకిందులు అయింది. ఉద్యోగాలు లేవు. ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నాయి. ఇండియాకు వచ్చేసేవారు కొందరు. పరిస్థితి మారుతుంది అని వేచి చూద్దాం అనుకునువారు మరికొందరు.

చాలా ఏళ్ల క్రితం వెళ్లి ఆస్తులు సంపాదించుకున్న వారు హ్యాపీ. గత పది, పదిహేను ఏళ్ల క్రితం వెళ్లిన వారి పరిస్థితే అగమ్యగోచరంగా తయారైంది. సరైన సమాచారం ఉండి ఉంటే వారు వెళ్లి ఉండేవారు కాదు. అమెరికా అద్భుత ప్రపంచం అక్కడికి వెళ్తే లైఫ్ సెటిల్ అయినట్లే. ఈ రెండేళ్లలో కారు, ఇల్లు కొనుకోవచ్చు అనే భ్రమలో ఉన్నారంతా. వీరికి వాస్తవ పరస్థితులు తెలిసే అవకాశం లేదు. అమెరికా ఉన్నత చదువులు, వీసాలు, అక్కడ ఉద్యోగాలు ఇప్పించడం ఇది రూ.వేల కోట్ల బిజినెస్. ఈ లాబా చాలా పవర్ ఫుల్ కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి:

usa

సంబంధిత వార్తలు: